రసెల్ విజృంభణ…కోల్‌కతా గెలుపు

ఐపిఎల్: ఐపీఎల్‌ తొలి రోజు ఆటతో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు రెండో రోజు అసలైన కిక్ దొరికింది. కోల్‌కతా, హైదరాబాద్‌ జట్లు పోటీ పడి పరుగుల వరద పారించాయి. చివరకు ఆండ్రీ రసెల్‌ మెరుపులు లీగ్‌లో జోష్‌ తెచ్చాయి.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ను చిత్తు చేసింది. రసెల్ వీరవిహారం […]

రసెల్ విజృంభణ...కోల్‌కతా గెలుపు
Follow us

|

Updated on: Mar 25, 2019 | 11:41 AM

ఐపిఎల్: ఐపీఎల్‌ తొలి రోజు ఆటతో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు రెండో రోజు అసలైన కిక్ దొరికింది. కోల్‌కతా, హైదరాబాద్‌ జట్లు పోటీ పడి పరుగుల వరద పారించాయి. చివరకు ఆండ్రీ రసెల్‌ మెరుపులు లీగ్‌లో జోష్‌ తెచ్చాయి.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ను చిత్తు చేసింది. రసెల్ వీరవిహారం చేయడంతో 182 విజయలక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు కొల్పోయి విజయం సాధించింది. ఆల్ రౌండర్ రసెల్ 19 బంతుల్లో 49 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్స్)చేసి కోల్ కతా జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ ఆఫ్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.