నవ్వు ఒక దివ్య ఔషధం… కడుపుబ్బా నవ్వితే…!

నవరసాలలో మన ఆరోగ్యాన్నిచ్చేది మాత్రం హాస్యరసమే. అలాంటి హాస్యం (నవ్వు) మన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని వైద్యులు, మానసిక నిపుణులు తరచుగా చెబుతూనే ఉంటారు. చిన్నతనంలో ఏ కల్మషం లేకుండా ఎలాగైతే నవ్వుతుంటామో పెరిగి పెద్దయ్యాక ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నప్పటికీ మనస్ఫూర్తిగా నవ్వుతుంటే మన ఆయుష్షుపై మంచి ప్రభావం ఉంటుంది. నవ్వించడం ఒక యోగము, నవ్వడం ఒక భోగము, నవ్వకపోవడం ఒక రోగం అని ప్రసిద్ధి. నిత్యం మనం ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించే మంచి మెడిసిన్ నవ్వు. […]

 • Tv9 Telugu
 • Publish Date - 3:42 pm, Thu, 17 October 19

నవరసాలలో మన ఆరోగ్యాన్నిచ్చేది మాత్రం హాస్యరసమే. అలాంటి హాస్యం (నవ్వు) మన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని వైద్యులు, మానసిక నిపుణులు తరచుగా చెబుతూనే ఉంటారు. చిన్నతనంలో ఏ కల్మషం లేకుండా ఎలాగైతే నవ్వుతుంటామో పెరిగి పెద్దయ్యాక ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నప్పటికీ మనస్ఫూర్తిగా నవ్వుతుంటే మన ఆయుష్షుపై మంచి ప్రభావం ఉంటుంది. నవ్వించడం ఒక యోగము, నవ్వడం ఒక భోగము, నవ్వకపోవడం ఒక రోగం అని ప్రసిద్ధి. నిత్యం మనం ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించే మంచి మెడిసిన్ నవ్వు.

ఫ్లోరిడాకు చెందిన వైద్య బృందం ‘నవ్వు-మానసిక ఆరోగ్యం’ అనే అంశంపై అధ్యయనం చేసింది. వారి అధ్యయనం ప్రకారం..నవ్వు వల్ల మనసు ఉల్లాసపడి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నవ్వు ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. గట్టిగా నవ్వడం వల్ల శరీరానికి ఆక్సిజన్‌ కూడా బాగా అందుతూ గుండె సంబంధిత రోగాలు దరిచేరవు. నవ్విన సందర్భాల్లో శరీరంలోని 108 కండరాలు ఉత్తేజితమవుతాయి. బీపీ అదుపులో ఉంటుంది. పావుగంట సేపు నవ్వితే శరీరంలోని సుమారు 40 కేలరీలు కరిగిపోతాయి. నొప్పుల నివారణకు తోడ్పడే ఎండార్ఫిన్‌ నవ్వు ద్వారా లభిస్తుంది. డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకు లాఫింగ్‌ థెరఫీ ట్రీట్‌మెంట్‌ చేస్తే 70 శాతం సత్ఫలితాలు లభిస్తాయి. థైరాయిడ్‌, మైగ్రెయిన్‌, స్పాండిలైటిస్‌ వంటి సమస్యలకు నవ్వుతో పరిష్కారం చూపవచ్చు.

నవ్వు వల్ల కలిగే ప్రయోజనాలివే…

 • నవ్వితే శరీరంలోని 108 కండరాలు ఉత్తేకితమవుతాయి
 • గట్టిగా నవ్వే వారిలో బీపీ అదుపులో ఉంటుంది
 • మనం 15 నిమిషాలు నవ్వితే సుమారు 40 కేలరీలు కరిగిపోతాయి
 • గట్టిగా నవ్వుతున్న సమయంలో మన శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు
 • నవ్వితే శరీరంలో నొప్పుల నివారణకు తోడ్పడే ఎండార్ఫిస్‌ విడుదల అవుతుంది
 • నిత్యం నవ్వుతూ ఉండే వారికి జీర్ణశక్తి పెరుగుతుంది
 • మానసిక రోగాలు నయం చేయడానికి నవ్వు ఔషదంలా పనిచేస్తుంది
 • నవ్వు మెడకు మంచి వ్యాయామం. హాయిగా నవ్వుకుంటే మెడ నొప్పి సమస్య ఉండదు
 • మానసిక ఉల్లాసానికి నవ్వు ఓ దివ్వ ఔషధం
 • హాయిగా నవ్వుకునే వారికి హైబీపీ, ఉబ్బసం, మధుమేహం, మానసిక ఒత్తిడి దూరం
 • జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది
 • హాయిగా నవ్వే వారికి నరాల బలహీనతలు కూడా దరిచేరవు.
 • డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకు లాఫింగ్ థెరపీ ట్రీట్‌మెంట్ చేయగా 70 శాతం వరకు సత్ఫలితాలు.
 • థైరాయిడ్‌, మైగ్రేన్‌, స్కాండిలైటిస్‌ వంటి ఎన్నో సమస్యలను పరిష్కారం చూపుతుంది నవ్వు.