తమిళంలో ‘గీత’ జోరు మాములుగా లేదు.!

Rashmika Mandanna, తమిళంలో ‘గీత’ జోరు మాములుగా లేదు.!

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె తమిళ హీరో కార్తీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో భారీ ప్రాజెక్ట్‌కు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం తమిళ స్టార్ హీరో విజయ్ నూతన దర్శకుడు లోకేష్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక‌ను ఎంపిక చేశారట చిత్ర యూనిట్. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *