మారిపోయారు సర్… మీరు మారిపోయారు!

సీఎం రమేశ్..ఒకప్పుడు టీడీపీలో ట్రబుల్ షూటర్. పార్టీ ఆర్థిక వ్యవహారాల దగ్గర్నుంచి, అసంతృప్త నాయకుల బుజ్జగింపులు, కొన్ని చోట్ల సీట్ల కేటాయింపుల్లో కూడా ఆయన చక్రం తిప్పేవారు. ఒకరకంగా చంద్రబాబుకు రైట్ హ్యాండ్ అనుకోండి. కానీ గత ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాభవంతో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా ఆయనకు అక్కడ కూడా తన టాలెంట్ ను ప్రదర్శించే అద్భుత అవకాశం దక్కింది. ఇంకేముంది చెలరేగిపోయారు. సమాచార హక్కు చట్టానికి సవరణలు చేస్తూ ప్రవేశ పెట్టిన బిల్లును […]

మారిపోయారు సర్... మీరు మారిపోయారు!
Follow us

|

Updated on: Jul 26, 2019 | 11:02 PM

సీఎం రమేశ్..ఒకప్పుడు టీడీపీలో ట్రబుల్ షూటర్. పార్టీ ఆర్థిక వ్యవహారాల దగ్గర్నుంచి, అసంతృప్త నాయకుల బుజ్జగింపులు, కొన్ని చోట్ల సీట్ల కేటాయింపుల్లో కూడా ఆయన చక్రం తిప్పేవారు. ఒకరకంగా చంద్రబాబుకు రైట్ హ్యాండ్ అనుకోండి. కానీ గత ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాభవంతో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

తాజాగా ఆయనకు అక్కడ కూడా తన టాలెంట్ ను ప్రదర్శించే అద్భుత అవకాశం దక్కింది. ఇంకేముంది చెలరేగిపోయారు. సమాచార హక్కు చట్టానికి సవరణలు చేస్తూ ప్రవేశ పెట్టిన బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టే వేళలో.. తమకు తగ్గిన సభ్యుల బలాన్ని సమకూర్చే బాధ్యతను అమిత్ షా కుడిభుజం భూపేందర్ సింగ్ తో పాటు సీఎం రమేశ్ కు.. సుజనా చౌదరిని అప్పజెప్పారు. దక్షిణాదిన ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. మరికొన్ని పార్టీల అధినేతలతో మంతనాలు జరపటం.. వారిని ఒప్పించే విషయంలో వారు ప్రదర్శించిన టాలెంట్ బీజేపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Latest Articles