మరో మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు..

సూర్యుడి తాపానికి ఇన్ని రోజులూ విలవిలలాడిన తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీనితో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అటు హైదరాబాద్ లో కూడా వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఇక ఇదంతా నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ అని.. రానున్న రోజుల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. […]

మరో మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు..
Follow us

|

Updated on: May 31, 2020 | 7:14 PM

సూర్యుడి తాపానికి ఇన్ని రోజులూ విలవిలలాడిన తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీనితో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అటు హైదరాబాద్ లో కూడా వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఇక ఇదంతా నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ అని.. రానున్న రోజుల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ఆ తర్వాత తదుపరి 24 గంటల్లో తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే రానున్న 3 రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కాగా, నైరుతి రుతుపవనాలు రేపు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.