ఓటమి అనంతరం.. రేపు అమేథీకి రాహుల్..

సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో రాహుల్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే పరాజయం పాలైన తర్వాత ఇప్పటి వరకు అక్కడికి రాహుల్ వెళ్లలేదు. ఎట్టకేలకు అమేథీకి వెళ్లేందుకు రాహుల్ సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం.. రాహుల్‌ మొదటిసారిగా బుధవారం అమేథీలో పర్యటించనున్నారు. ముందుగా లక్నోకు చేరుకుని గౌరీగంజ్‌లో అక్కడి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి గల కారణాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత శివమహేశ్‌ మెడికల్‌ […]

ఓటమి అనంతరం.. రేపు అమేథీకి రాహుల్..
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2019 | 12:07 AM

సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో రాహుల్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే పరాజయం పాలైన తర్వాత ఇప్పటి వరకు అక్కడికి రాహుల్ వెళ్లలేదు. ఎట్టకేలకు అమేథీకి వెళ్లేందుకు రాహుల్ సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం.. రాహుల్‌ మొదటిసారిగా బుధవారం అమేథీలో పర్యటించనున్నారు. ముందుగా లక్నోకు చేరుకుని గౌరీగంజ్‌లో అక్కడి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి గల కారణాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత శివమహేశ్‌ మెడికల్‌ కళాశాల వేడుకకు హాజరు కానున్నారు.

కాగా, పదిహేనేళ్లుగా రాహుల్‌ గాంధీ కుటుంబీకులు అమేథీలో విజయబావుటా ఎగురవేస్తూ వచ్చారు. కానీ మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌ ఓటమి పాలయ్యారు.