టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లే: రాహుల్‌

హుజూర్‌నగర్‌: ప్రధాని మోదీ కేవలం ధనవంతుల కాపాలాదారుడని..ఆయనకు పేదవాళ్లతో పనిలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. జీఎస్టీ, నోట్ల రద్దు రూపంలో ప్రజల నుంచి డబ్బును ప్రధాని మోదీ దోచుకున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బును అనిల్‌ అంబానీకి దారాదత్తం చేశారని రాహుల్  విమర్శించారు. మోదీ పాలనలో మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. పరిశ్రమలను పునరుద్ధరిస్తే నిరుద్యోగం, పేదరికం రెండూ పోతాయన్నారు. […]

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లే: రాహుల్‌
Follow us

|

Updated on: Apr 01, 2019 | 7:33 PM

హుజూర్‌నగర్‌: ప్రధాని మోదీ కేవలం ధనవంతుల కాపాలాదారుడని..ఆయనకు పేదవాళ్లతో పనిలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. జీఎస్టీ, నోట్ల రద్దు రూపంలో ప్రజల నుంచి డబ్బును ప్రధాని మోదీ దోచుకున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడారు.

ప్రజల నుంచి దోచుకున్న డబ్బును అనిల్‌ అంబానీకి దారాదత్తం చేశారని రాహుల్  విమర్శించారు. మోదీ పాలనలో మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. పరిశ్రమలను పునరుద్ధరిస్తే నిరుద్యోగం, పేదరికం రెండూ పోతాయన్నారు. దేశవ్యాప్తంగా 22లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నెలకు ఇచ్చే రూ.6వేలతో నిరుపేదల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.

Latest Articles