రఫెల్ తో మనం మరింత పటిష్టమవుతాం: ఎయిర్‌ఫోర్స్‌ వైస్‌ చీఫ్‌

దిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల రాకతో మన వైమానిక దళ సామర్థ్యం పెరగుతుందని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వైస్‌ చీఫ్‌ అనిల్‌ ఖోస్ల అన్నారు. రఫేల్‌పై రాజకీయ రగడ జరుగుతోన్న నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా స్పందించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు నాటికి తొలి రఫేల్‌ యుద్ధ విమానం భారత్‌కు రానున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌లో డెలివరీ చేయగా.. దాన్ని భారత్‌కు తీసుకురానున్నట్లు వెల్లడించారు. గతేడాది నవంబరులో రఫేల్‌ ఫస్ట్‌లుక్‌ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌లో […]

రఫెల్ తో మనం మరింత పటిష్టమవుతాం: ఎయిర్‌ఫోర్స్‌ వైస్‌ చీఫ్‌
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 6:41 PM

దిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల రాకతో మన వైమానిక దళ సామర్థ్యం పెరగుతుందని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వైస్‌ చీఫ్‌ అనిల్‌ ఖోస్ల అన్నారు. రఫేల్‌పై రాజకీయ రగడ జరుగుతోన్న నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా స్పందించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు నాటికి తొలి రఫేల్‌ యుద్ధ విమానం భారత్‌కు రానున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌లో డెలివరీ చేయగా.. దాన్ని భారత్‌కు తీసుకురానున్నట్లు వెల్లడించారు. గతేడాది నవంబరులో రఫేల్‌ ఫస్ట్‌లుక్‌ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌లో రఫేల్‌ తొలి యుద్ధ విమానానికి పరీక్షలు నిర్వహించారు. సెప్టెంబరు నాటికి రఫేల్‌ తొలి విమానం భారత్‌కు రానున్నట్లు గత నెల కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో వెల్లడించిన విషయం తెలిసిందే. మిగిలిన విమానాలు 2022లోపు అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు.

ప్రతిపక్షానిది అనవసర రాద్ధాంతం: భాజపా

‘విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలన్నీ బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి. ఆయన ప్రధానిని దేశద్రోహి అన్నారు. అతని దగ్గర నుంచి ఇటువంటి వ్యాఖ్యలకు మించి ఏమీ ఆశించలేం. విమాన తయారీ కంపెనీలకు రాహుల్‌ లాబీయిస్ట్‌గా పని చేస్తున్నారు. ఎయిర్‌బస్‌కు సంబంధించిన ఈమెయిల్స్‌ ఆయన వద్దకు ఎలా వచ్చాయ్‌? నిజాయతీగల ప్రధానమంత్రిని అవమానిస్తూ రాహుల్‌ తనపై తానే బురద చల్లుకుంటున్నారు. ఆయన ఆడుతున్న అబద్ధాలను ప్రజల ముందు బయటపెడతాం’ అని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ అనిల్‌ అంబానీకి ప్రధాని మోదీ మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపించిన విషయం తెలిసిందే.