రప్ఫాడించిన రఫెల్..యూఎస్‌ ఓపెన్ ఫైనల్లో క్లే కోర్టు కింగ్

US Open 2019: Nadal sets up Medvedev final, రప్ఫాడించిన రఫెల్..యూఎస్‌ ఓపెన్ ఫైనల్లో క్లే కోర్టు కింగ్

ఈ ఏడాది ఫ్రెంచ్ ​ఓపెన్​లో సత్తాచాటిన రఫెల్ నాదల్ మరో టైటిల్​పై కన్నేశాడు. శనివారం జరిగిన యూఎస్​ ఓపెన్​ సెమీస్​లో ఇటలీ ప్లేయర్ మాటియో బెరెటిని ఓడించి ఫైనల్​ చేరాడు. ఆదివారం జరగనున్న తుదిపోరులో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్​తో తలపడనున్నాడు. 18 గ్రాండ్​స్లామ్​ల విజేతగా నిలిచిన స్పెయిన్​ బుల్ రఫెల్ నాదల్.. యూఎస్​ ఓపెన్ రూపంలో మరో టైటిల్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. న్యూయార్క్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో నెగ్గి 5వ సారి యూఎస్​ఫైనల్లో ఆడనున్నాడు. కాగా నాదల్ విజయంతో.. 42 ఏళ్లలో యుఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌ చేరిన తొలి ఇటలీ ఆటగాడిగా రికార్డు సృష్టించిన బెరెటిని సెమీఫైనల్లో ఓటమిపాలయ్యాడు. తొలి సెట్​లో ఇరువురు హోరాహోరీగా పోరాడారు. అయితే రఫెల్‌ వేగాన్ని అందుకోలేకపోయాడు మాటియో. రెండో సెట్​లోనూ బలమైన పోటీనిచ్చినప్పటికీ స్పెయిన్​బుల్ అతడికి అవకాశమివ్వలేదు. మూడో సెట్​లో సులభంగా నాదల్​కు లొంగిపోయాడు మాటియో.

మరో సెమీస్‌లో దిమిత్రోవ్‌పై మెద్వెదెవ్‌ పైచేయి సాధించాడు. 7-6 (7-5), 6-4, 6-3 తేడాతో విజయం సాధించాడు. దీంతో 14 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన రష్యన్‌ ఆటగాడిగా మెద్వెదెవ్‌ రికార్డు నెలకొల్పాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో ఐదో సీడ్‌ మెద్వెదెవ్‌తో నాదల్‌ తలపడనున్నాడు. నాదల్‌కు కెరీర్‌లో ఇది 27వ ఫైనల్ కాగా మెద్వెదెవ్‌కు తొలి ఫైనల్. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు అందుకున్న ఫెదరర్‌ (20)ను సమీపించేందుకు నాదల్‌కు ఇది చక్కని అవకాశంగా అందరూ భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *