బీర్లు తాగినందుకే.. ఆ సినిమా అవకాశం పోగొట్టుకున్నా..!

Radhika Apte reveals she lost out on Vicky Donor for being overweight by a few kilos, బీర్లు తాగినందుకే.. ఆ సినిమా అవకాశం పోగొట్టుకున్నా..!

‘రక్తచరిత్ర, లయన్, లెజెండ్’ సినిమాలతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆప్టే.. తక్కువ కాలంలో.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో.. పాటు అభినయంతో తక్కువ కాలంలోనే.. అవకాశాలు రాబట్టుకుంటోంది. తెలుగు, హిందీతో పాటు, దక్షిణాది చిత్రాల్లోనూ నటిగా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. సెప్టెంబర్ 7 శనివారం.. పుట్టినరోజు సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

కొద్ది కాలంలోనే.. గుర్తింపు తెచ్చుకున్న ఆప్టే.. కాస్టింగ్ కౌచ్‌ విషయంలో సంచలన ఆరోపణలు చేసింది. ఓ దక్షిణాది యాక్టర్.. తనను ఇబ్బంది పెట్టాడని బహిర్గతంగా.. మీడియా ముందు ధైర్యంగా బయటపెట్టింది. అలాగే.. ‘పార్చెడ్’ అనే సినిమాలో నగ్నంగా నటించి వార్తల్లోకెక్కింది. కాగా.. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా పలు విషయాల గురించి చెప్పుకొచ్చింది.

అలా.. ఒకసారి బీర్లు తాగా బాగా.. లావెక్కిపోయానని.. అందుకే ‘వీక్కీ డోనర్’ అనే మంచి సినిమాను మిస్‌ అయినట్టు చెప్పింది. అలాగే.. తనకు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల అవకాశాలు రాబట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని.. డబ్బు కోసం కొన్ని అభ్యకర చిత్రాల్లో నటించాల్సి వచ్చిందని రాధిక చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని.. సినిమా అవకాశాలు కూడా బాగా వస్తున్నాయని చెప్పింది రాధికా ఆప్టే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *