పులస చేపను 21వేలకు దక్కించుకున్న వైసీపీ నేత

పుస్తెలు తాడు తాకట్టు పెట్టైనా పులస తినాలంటారు. ఎందుకు ఈ చేపకు ఇంత క్రేజ్ అంటారా. ఒకసారి తింటే మీకే అర్థమవుతుంది.

పులస చేపను 21వేలకు దక్కించుకున్న వైసీపీ నేత
Follow us

|

Updated on: Sep 21, 2020 | 4:52 PM

పుస్తెలు తాడు తాకట్టు పెట్టైనా పులస తినాలంటారు. ఎందుకు ఈ చేపకు ఇంత క్రేజ్ అంటారా. ఒకసారి తింటే మీకే అర్థమవుతుంది. కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే సీజనల్ గా దొరికే అరుదైన పులస కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. పులస అంటే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలే. పులస చేపల్ని హిల్సా ఫిష్ అని పిలుస్తారు. ఇవి ఆస్ట్రేలియా సముద్ర జలాల్లో ఉంటాయి. వర్షాకాలం మొదలవగానే… ఇవి భారతదేశం వైపు ప్రయాణం ప్రారంభిస్తాయి. సరిగ్గా భారత్ లో వానలు పడి, గోదావరి వదర నీటితో ఉప్పొంగుతోన్న సమయంలో  పులస చేపలు… సముద్రం నుంచి… గోదావరి నీటిలోకి… ఎదురీదుతూ ప్రయాణిస్తాయి. అక్కడ ఈ చేపల కలర్ మారిపోతుంది. గోదావరి జలాల్లో ప్రయాణించడం వల్ల వీటి టేస్టు కూడా మారుతుంది. అటు సముద్ర జలాలు, ఇటు గోదావరి జలాలలో ఈదడం వలన… ఈ చేపలు అద్భుతమైన రుచి కలిగివుంటాయి.

మాంసాహారులు లొట్టలేసుకుని తినే ఈ పులస ప్రజంట్ స్టేటస్‌కు సింబల్‌గా మారిపోయింది. రేటు కాదు ముఖ్యం.. పులస దొరికితే చాలు అనుకునే మాంసం ప్రియులు చాలామంది ఉంటారు.  ఎంతో రుచికరమైన పులస చేప ఆదివారం వైనతేయ గోదావరి నదిలో పాశర్లపూడికి చెందిన మత్స్యకారుల వలకు చిక్కింది. భారీ డిమాండు ఉన్న ఈ పులస రెండున్నర కిలోల బరువు తూకింది. దీనిని పాశర్లపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేత, నగరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్ముల కొండలరావు ఏకంగా రూ.21 వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు.

Also Read : ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కోడిగుడ్డు ధర !

Latest Articles
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట