‘‘అమ్మా సునీత’’ అంటూ ఆరోపణలపై బన్నీ వాసు వివరణ

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి సినీ నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశారంటూ జూనియర్ ఆర్టిస్ట్ బోయ సునీత చేసిన ఆరోపణలపై బన్నీ వాసు స్పందించారు. దీనికి సంబంధించిన ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. సునీత ప్రవర్తన వలనే తాము కారెక్టర్స్ ఇవ్వలేకపోయామని.. అంతేతప్ప మరే ఇతర కారణాలు లేవని ఆయన అన్నారు. మొదట తమ దగ్గరికి వచ్చిన ఆమె.. నేను జనసేనలో పనిచేస్తున్నాను. ఏదైనా కారెక్టర్ ఉంటే ఇవ్వండి అని […]

‘‘అమ్మా సునీత’’ అంటూ ఆరోపణలపై బన్నీ వాసు వివరణ
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 11:35 AM

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి సినీ నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశారంటూ జూనియర్ ఆర్టిస్ట్ బోయ సునీత చేసిన ఆరోపణలపై బన్నీ వాసు స్పందించారు. దీనికి సంబంధించిన ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. సునీత ప్రవర్తన వలనే తాము కారెక్టర్స్ ఇవ్వలేకపోయామని.. అంతేతప్ప మరే ఇతర కారణాలు లేవని ఆయన అన్నారు.

మొదట తమ దగ్గరికి వచ్చిన ఆమె.. నేను జనసేనలో పనిచేస్తున్నాను. ఏదైనా కారెక్టర్ ఉంటే ఇవ్వండి అని కోరింది. మేం కూడా ఆమెకు ఏదైనా చూడమని గీతా ఆర్ట్స్ వాళ్లకు చెప్పాం. అయినా జనసేనలో పనిచేసిందని.. ఆమెకు మేము కారెక్టర్ ఇవ్వాలనుకోలేదు. మెగా హీరోలను అభిమానిస్తుంది. అందులోనూ ఆమె తండ్రి తమకు తెలిసిన థియేటర్స్‌లో పనిచేశారు కాబట్టి ఏదైనా కారెక్టర్ ఉంటే ఇవ్వమని ఆఫీసులో చెప్పామని ఆయన అన్నారు.

‘‘అమ్మా బోయ సునీత.. సినిమాలో కారెక్టర్ కావాలని నువ్వు మమ్మల్ని అడిగే విధానం బాలేదు. మొదట్లో మీరంటే అభిమానం అంటూ పోస్ట్‌లు పెట్టావు. అప్పుడు మేం నీకు మంచి చేయాలనే అనుకున్నాం. కాని తరువాత నీ ఆటిట్యూడ్‌తో మాకు అనుమానం ఏర్పడింది. ఈమెను లొకేషన్‌కి తీసుకువెళ్లినా ప్రశాంతంగా చేస్తుందా? అని మమ్మల్ని ఆలోచింపజేసేలా చేశావు. నువ్వు ఒక మహిళవి. అది మరచి రాత్రి పూట వచ్చి గేట్ దగ్గర హడావిడి చేస్తే.. ఏం చేయాలో తెలియక పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. నాకు పోలీసులు ఫోన్ చేస్తే.. వదిలేయండని చెప్పా. కావాలంటే నువ్వు నువ్వు స్టేషన్‌కు వెళ్లి అడుగు వారు చెప్తారు. ఇక ఆ మరునాడు ఉదయం మా ఆఫీస్‌కి వెళ్లి అక్కడ కిచెన్‌‌లో కత్తి తీసుకుని నేను చచ్చిపోతున్నా అని ఫేస్ బుక్‌లైవ్ పెడితే మాకు కంగారు రాదా? అందుకే మేం మళ్లీ పోలీసుల్ని ఆశ్రయించాం. నీ బిహేవియర్ చూసి మాకు భయం వేసింది. అప్పుడు నిన్ను కూర్చోబెట్టి చెప్పాం. మమ్మల్ని డిస్ట్రబ్ చేయకు. మా వాళ్లు ఏదైనా ఆడిషన్ ఉంటే చెప్తారు. అప్పుడు వెళ్లు అని చెప్పాం. మా పేరెంట్స్‌గా బాలేదని అన్నావు. దానికి కూడా మేం సాయం చేస్తాం అని హామీ ఇచ్చాం. కానీ ఇంతలోనే 15 రోజులు కాగానే అనారోగ్యంతో ఉన్న మీ నాన్నను తీసుకుని వచ్చి ఆయనను మా గేటు దగ్గర వదిలిపెట్టేసి వెళ్లిపోయావు. మాకు ఏం చేయాలో తెలియక మీ నాన్నను కారులో ఇంటికి పంపాం. ఇదంతా మేం ఓపికతో చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఆడపిల్లవి. ఏదో ఇండస్ట్రీకి వచ్చావు. కష్టపడుతుంది అనే అనుకున్నాం. కానీ నువ్వు సినిమాలో నటించాలి అంటే నీకో బ్యాలెన్స్ ఉండాలి. అదేం లేకుండా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే.. ఇంకో పది సంవత్సరాలైనా ఇలాగే ఉంటావు’ అంటూ ఘాటు కౌంటర్ ఇచ్చారు వాసు.