Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 2,07615. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 100303. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5,815. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు. 353, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీబీఐ. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం అతనిపై దాడి చేయడం, సెల్ ఫోన్ పగుల గొట్టడం, బెదిరింపులకు దిగినట్టు డాక్టర్ సుధాకర్ పై అభియోగాలు.
  • తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టులో విచారణ ఏపీ నుంచి తెలంగాణ కి రిలీవ్ అయిన ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులం. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ లోని పని చేయాలని కోరుకుంటున్నామని తెలిపిన ఉద్యోగులు.
  • వైద్య కళాశాలలను భయపెడుతున్న కరోనా. హైదరాబాద్ లో మూడు వైద్య కళాశాలల్లో బయటపడిన కరోనా పాజిటివ్ కేసులు. కరోనా పాజిటివ్స్ లో ఎక్కువ మంది హాస్టల్ విద్యార్థులు . అత్యవసర చర్యలు చేపట్టిన వైద్య కళాశాలలు.
  • టీవీ9 తో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ 200 సయ్యద్ ఉమర్ జలీల్ లాక్‌డౌన్‌ నిబంధనల మధ్య జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. పరీక్షలు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగాయి.
  • తీరం దాటుతున్న నిసర్గ తుఫాను. అలీబాగ్‌కు సమీపంలో తీరాన్ని తాకిన నిసర్గ. తీరాన్ని దాటేందుకు మరో గంట సమయం. ముంబై విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై నిషేధం. సాయంత్రం గం. 7.00వరకు నిషేధించిన అధికార యంత్రాంగం.

చిక్కుల్లో పడ్డ పృథ్వీ షా.. మళ్ళీ వేటు తప్పదా.?

Allegations On Indian Cricketer, చిక్కుల్లో పడ్డ పృథ్వీ షా.. మళ్ళీ వేటు తప్పదా.?

డోపింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యి 8 నెలలు నిషేదానికి గురైన యువ క్రికెటర్ పృథ్వీ షా మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు. బ్యాన్ పూర్తి చేసుకుని అంతర్జాతీయ క్రికెట్‌కు అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ప్రస్తుతం ముంబై తరపున రంజీ మ్యాచులు ఆడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అద్భుత ప్రదర్శనను కనబరిచిన పృథ్వీ షా.. అదే ఫామ్‌ను రంజీల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు.

హోటల్ సిబ్బందితో గొడవ…

రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడిన షా మొదటి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో 202(179) పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే, ఈ సీజన్‌లో ముంబై తన రెండో మ్యాచ్‌కు సిద్దమవుతున్న తరుణంలో.. పృథ్వీ షా తనకు తానుగా ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు. 

అందుతున్న సమాచారం బట్టి పృథ్వీ షా, సహా ఆటగాడు ఏక్‌నాధ్ కెర్కర్‌లపై జట్టు యాజమాన్యం క్రమశిక్షణా చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇద్దరూ కూడా హోటల్ సిబ్బందితో తీవ్రమైన గొడవకు దిగారని సమాచారం. ఈ గొడవలో సిబ్బందికి గాయాలు కూడా అయ్యాయని వినికిడి. ఈ ఇద్దరి ఆటగాళ్లతో పాటుగా కోచ్ వినాయక్ సామంత్‌పై కూడా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక కోచ్ సామంత్‌ టీమ్ మేనేజ్‌మెంట్ విషయంలో ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ముంబై క్రికెట్ అసోసియేషన్ ఈ అంశంపై పూర్తి నివేదిక ఇవ్వాలని జట్టు యాజమాన్యాన్ని కోరింది. ముంబై తన రెండో మ్యాచ్ డిసెంబర్ 25న రైల్వేస్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లోపు గోడపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంసీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏది ఏమైనా పృథ్వీ షాపై రెండు మ్యాచుల వేటు పడే అవకాశం కనిపిస్తోంది.

Related Tags