YS Sharmila hunger strike: నిరుద్యోగుల సమస్యలపై బాణం ఎక్కుపెట్టిన వైఎస్ షర్మిల.. రేపటి నిరాహార దీక్షకు సర్వం సిద్ధం..!

తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. మరో సంచలనానికి తెర తీశారు.

YS Sharmila hunger strike: నిరుద్యోగుల సమస్యలపై బాణం ఎక్కుపెట్టిన వైఎస్ షర్మిల.. రేపటి నిరాహార దీక్షకు సర్వం సిద్ధం..!
Ys Sharmila
Follow us

|

Updated on: Apr 14, 2021 | 7:41 PM

తెలంగాణ రాజకీయాల్లో కొత్త బాణం దూసుకొస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. మరో సంచలనానికి తెర తీశారు. ముందు తెలంగాణ యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇందులో భాగంగానే నిరుద్యోగుల సమస్యల తరఫున పోరాటానికి సిద్ధమయ్యారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ప్రతినిధిగా పోరు బాటపట్టారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేసన్ కోసం నేరుగా కేసీఆర్ సర్కార్‌ను ఢీకొట్టబోతున్నారు. ఖమ్మం సంకల్ప సభ సందర్భంగా చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకునేందుకు నిరుద్యోగ యువత తరఫున నిరాహార దీక్షకు పూనుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే క్రమంలో దివంగత నేత వైఎస్ఆర్ జయంతి రోజు అయిన జులై 8వ తేదీన కొత్త పార్టీని ఆవిష్కరిస్తామని షర్మిల ప్రకటించారు. పేరు, జెండా, అజెండా అన్ని ఆ రోజే ప్రకటిస్తామని ఖమ్మం వేదికగా వెల్లడించారు వైఎస్ షర్మిల. ఆత్మగౌరవ తెలంగాణలో ప్రశ్నించడానికే ఓ పార్టీ అవసరం అన్నారు. వైఎస్సార్‌ది సంక్షేమపాలన అన్నారు షర్మిల.

ఇదిలావుంటే, ఖమ్మంలో నిర్వహించిన సంకల్పసభలో ఇచ్చిన హామీ మేరకు మూడురోజుల పాటు నిరహార దీక్ష చేయనున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి మూడురోజుల పాటు ఆమె నిరాహార దీక్ష కొనసాగుతుంది. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఇందిరాపార్క్‌ను దీనికి వేదికగా చేసుకున్నారు. తెలంగాణ పీఆర్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో లక్షా 91 వేలకు పైగా అనుమతి పొందిన పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వాటి కోసం వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు వైఎస్ షర్మిల. నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే వరకు దీక్షలు ఆగవన్నారు.

కాగా ఇందుకోసం పోలీసుల అనుమతి కోరారు షర్మిల అనుచరులు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీని కలిసి వినతి పత్రం సమర్పించారు. అయితే, షర్మిల నిరాహార దీక్షకు ఒక రోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 10 నుంచి 5 వరకు మాత్రమే పోలీసులు ఇందిరా పార్క్‌లో దీక్షకు అనుమతి ఇచ్చారు.

ఇదిలావుంటే, తాను తలపెట్టిన నిరాహార దీక్షకు వైఎస్ షర్మిల ప్రజా సంఘాలు, తటస్థ రాజకీయ పార్టీల నేతల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ వంటి నాయకులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ప్రజా యుద్ధ నౌక గద్దర్‌తో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య.. షర్మిల నిరాహార దీక్షకు నైతిక మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.

పోలీసుల అనుమతి లభించడంతో ఇందిరాపార్కు దగ్గర ఏర్పాట్లను ముమ్మరం చేశారు షర్మిల అనుచరులు. మరోవైపు ప్రతిపక్షాలకు కూడా ముందుగానే ఆహ్వానం పంపారు. మూడు రోజుల పాటు జరిగే షర్మిల దీక్షకు మద్దతు తెలిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు షర్మిల అనుచరులు.

Read Also…  సీఎం పదవి తెలంగాణ ప్రజలు పెట్టిన బిక్ష.. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తాంః కేసీఆర్

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?