వైసీపీలో నారీ-భేరీ.. అదరగొడ్తున్న ఆ ముగ్గురు

వైసీపీలో మహిళా లీడర్ల హవా పెరిగింది. వైసీపీలో మహిళా లీడర్లంటే గతంలో మనకు ఠక్కున గుర్తొచ్చేవారు సినీ నటి రోజా ఒక్కరే. తెలుగుదేశం పార్టీలో వున్నప్పట్నించి కూడా రోజాను ఓ ఫైర్ బ్రాండ్‌గానే చూసే వారు. ఆమెతో పెట్టుకోవాలంటే ఎవరైనా జంకే పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి వారికైనా తనదైన శైలిలో జవాబివ్వడమే కాకుండా రాజకీయ, సామాజికాంశాలపై తనదైన శైలిలో అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేవారు రోజా. తాజాగా ఆమె నగరి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ.. ఏపిఐఐసి ఛైర్మన్‌గాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. […]

వైసీపీలో నారీ-భేరీ.. అదరగొడ్తున్న ఆ ముగ్గురు
Rajesh Sharma

| Edited By: Srinu Perla

Dec 13, 2019 | 7:16 PM

వైసీపీలో మహిళా లీడర్ల హవా పెరిగింది. వైసీపీలో మహిళా లీడర్లంటే గతంలో మనకు ఠక్కున గుర్తొచ్చేవారు సినీ నటి రోజా ఒక్కరే. తెలుగుదేశం పార్టీలో వున్నప్పట్నించి కూడా రోజాను ఓ ఫైర్ బ్రాండ్‌గానే చూసే వారు. ఆమెతో పెట్టుకోవాలంటే ఎవరైనా జంకే పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి వారికైనా తనదైన శైలిలో జవాబివ్వడమే కాకుండా రాజకీయ, సామాజికాంశాలపై తనదైన శైలిలో అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేవారు రోజా.

తాజాగా ఆమె నగరి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ.. ఏపిఐఐసి ఛైర్మన్‌గాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అసెంబ్లీలో ఇప్పుడు అవసరాన్ని బట్టి మాట్లాడుతున్నారు రోజా. తాజాగా వైసీపీలో పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. రోజా స్థానంలో మరికొందరు మహిళా నేతలు రాజకీయ ప్రత్యర్థుల వెన్నులో చలిపుట్టిస్తున్నారు. హోం మంత్రి మేకతోటి సుచరిత వీరిలో ఒకరు కాగా.. మరో మంత్రి పుష్పవాణి ఇంకొకరు. తాజాగా ఈ జాబితాలో మరోపేరు చేరింది. ఆమె రజనీ.

సుచరిత, పుష్పవాణి, రజనీ.. ఈ మహిళా నేతల త్రయం ఇప్పుడు ఏ టాపిక్ వచ్చినా తెలుగుదేశం పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టేలా మాట్లాడుతున్నారు. తాజాగా అందరినీ ఆకట్టుకుంటున్న రజనీ పేరు ఏపీ అసెంబ్లీలో అందరి నోళ్ళలో నానుతోంది. రాజకీయ ప్రత్యర్థులను ఆమె ఎదుర్కొంటున్న తీరు ప్రశంసనీయంగా వుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా అసెంబ్లీ జరుగుతున్న రచ్చ రంబోలాలో తెలుగుదేశం పార్టీని, మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేతను ఇరుకున పెడుతున్న వైసీపీ నేతల్లో రజనీ ఒకరు. దిశ బిల్లుపై మాట్లాడిన హోం మంత్రి సుచరిత అందరినీ ఆకట్టుకున్నారు.

ఏపీ అసెంబ్లీలో పెద్ద ఎత్తున రగడ జరుగుతుండగా.. చంద్రబాబుకు అండగా గోరంట్ల, అచ్చెన్నాయుడు, రామానాయుడు మాత్రమే కనిపిస్తున్నారు. మిగిలిన వారిలో చాలా మంది అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో వైసీపీలో దూకుడు కనిపిస్తోంది.

ఇలా ఒకప్పుడు వైసీపీ అంటే రోజా ఒక్కరే గుర్తొచ్చావారు. తాజాగా ఆమె కాస్త సైలెంటైనా.. మరో ముగ్గురు సుచరిత, పుష్పవాణి, రజనీల రూపంలో వైసీపీకి మహిళా నేతల దండు అండగా మారిందన్న కామెంట్లు పొలిటికల్ ఆబ్జర్వర్ల నోట వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu