పార్టీ గురించి బహిరంగంగా మాట్లాడితే సహించేది లేదన్న టీడీపీ అధినేత.. ఆ వార్నింగ్‌లో వాస్తవం లేదన్న ఎంపీ కేశినేని

విజయవాడ టీడీపీలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ఆదిపత్య పోరు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఒకే పార్టీకి చెందిన..

పార్టీ గురించి బహిరంగంగా మాట్లాడితే సహించేది లేదన్న టీడీపీ అధినేత.. ఆ వార్నింగ్‌లో వాస్తవం లేదన్న ఎంపీ కేశినేని
Follow us

|

Updated on: Feb 22, 2021 | 1:45 PM

విజయవాడ టీడీపీలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ఆదిపత్య పోరు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఒకే పార్టీకి చెందిన ఆ నేతలిద్దరూ వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించుకోవడం రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గురించి మాట్లాడినా, వ్యక్తిగత విమర్శలు చేసుకున్నా సహించేది లేదని హెచ్చరించారు.

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీడీపీ నేతల మధ్య గ్రూప్ వార్ బయటపడింది. నగరంలోని 39వ డివిజన్‌ కేంద్రంగా ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. 39వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పూజిత పోటీలో ఉంది. అయితా తాజాగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన శివ కుమార్‌‌ను కేశినేని వర్గం ప్రోత్సహిస్తోందనే ప్రచారం ఇద్దరి నేతల మధ్య వైరుద్యానికి దారి తీసింది.

కొన్ని రోజులుగా ఈ వ్యవహరం హీట్ పెంచింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలను టీడీపీ అధినేత చంద్రబాబు పిలిచి వార్నింగ్ ఇచ్చారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు కేశినేని నాని. ‘నాకు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు దయ చేసి తప్పుడు వార్తలు ప్రచరించ వద్దు’అన్నారు కేశినేని.

Read more:

ఎదురు కాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ.. కూంబింగ్‌ దళాలే టార్గెట్‌గా పేలిన మందుపాతర.. ఓ జవాన్‌కు తీవ్ర గాయాలు