టీఆర్ఎస్, వైసీపీ మధ్య రహస్య ఒప్పందం బహిర్గతం: దేవినేని ఉమా

విజయవాడ: వైఎస్ జగన్ ముసుగు రాజకీయాలు తొలగిపోయాయని అన్నారు దేవినేని ఉమా. టీఆర్ఎస్, వైసీపీ పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏమిటో జగన్ వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారాయన. ఏపీ అభివృద్ధిని ఓర్చుకోలేని టీఆర్ఎస్‌కు జగన్ మద్దతివ్వడమేంటని, ఇది ప్రజలు ఆలోచించాలని ఉమా అన్నారు. ఏపీలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్ధులకు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టులు ఇప్పించి, ఆ డబ్బులను ఇక్కడ విరజల్లుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఇచ్చిన వెయ్యి కోట్లను తీసుకొచ్చి ఇక్కడ జిల్లాల వారీగా పంచుతున్నారని విమర్శించారు. […]

టీఆర్ఎస్, వైసీపీ మధ్య రహస్య ఒప్పందం బహిర్గతం: దేవినేని ఉమా

Updated on: Mar 26, 2019 | 4:36 PM

విజయవాడ: వైఎస్ జగన్ ముసుగు రాజకీయాలు తొలగిపోయాయని అన్నారు దేవినేని ఉమా. టీఆర్ఎస్, వైసీపీ పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏమిటో జగన్ వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారాయన. ఏపీ అభివృద్ధిని ఓర్చుకోలేని టీఆర్ఎస్‌కు జగన్ మద్దతివ్వడమేంటని, ఇది ప్రజలు ఆలోచించాలని ఉమా అన్నారు.

ఏపీలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్ధులకు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టులు ఇప్పించి, ఆ డబ్బులను ఇక్కడ విరజల్లుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఇచ్చిన వెయ్యి కోట్లను తీసుకొచ్చి ఇక్కడ జిల్లాల వారీగా పంచుతున్నారని విమర్శించారు.

వైసీపీకి వేసే ప్రతి ఓటు మోడీ, కేసీఆర్‌కు వెళుతుందని, కేసీఆర్‌కు జగన్ ఒక సామంతరాజు అని అన్నారు. వైసీపీ అభ్యర్ధులను కేసీఆర్, బీజేపీ కలిసి నిర్ణయించారు. ఏపీకి వ్యతిరేకంగా ఐదేళ్లుగా కేసీఆర్ చేయని కుట్ర లేదని, అలాంటి కేసీఆర్‌కు జగన్ ఎలా మద్దతిస్తారని ఉమా ప్రశ్నించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us