ఓట్ల గల్లంతుపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌.. పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరిన గుంటూరు విద్యార్థిని

రాస్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరుకు చెందిన విద్యార్థిని..

ఓట్ల గల్లంతుపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌.. పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరిన గుంటూరు విద్యార్థిని
Follow us

|

Updated on: Jan 27, 2021 | 3:55 PM

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పీడ్‌ను పెంచింది. గవర్నర్‌, కలెక్టర్‌లతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వరుస భేటీలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రక్రియకు కావాల్సిన అన్ని హంగులు సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓట్లు గల్లంతు అయ్యాయని ఓ విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తిని రేపుతుంది.

రాస్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరుకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2019 నాటి ఓటర్ల జాబితాతో ఎన్నికలు జరపడం సరికాదని, 2021 ఎన్నికల జాబితాతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. 2019 ఓటర్ల జాబితాతో 3.60 లక్షల మంది ఓటర్లకు అన్యాయం జరుగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరుపుతామని న్యాయస్థానం వెల్లడించింది. అయితే, ఎల్లుండి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని పిటిషనర్‌ తరపు న్యాయవాది శివప్రసాదరెడ్డి కోర్టుకు తెలిపారు. దాంతో సానుకూలంగా స్పందించిన హైకోర్టు రేపు విచారించేందుకు అంగీకరించింది. అయితే ఇదే అంశంపై నిర్లక్ష్యం వహించారని ఇప్పటికే అధికారులపై ఎస్‌ఈసీ

Latest Articles