ప్రధాని రేసులో నేనా… నో..నో..నో..

లక్నో : మహాకూటమిలో అందరూ ప్రధానమంత్రి అభ్యర్థులేనని, అసలు అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ బీజేపీ చేస్తున్న విమర్శలపై యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పందించారు. తానైతే ప్రధాని పదవి రేసులో లేనని తేల్చి చెప్పారు. తనకు అటువంటి ఉద్దేశం కూడా లేదన్న ఆయన.. దేశానికి తదుపరి ప్రధాని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయితే చాలా సంతోషిస్తానని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ కంటే ప్రాంతీయ పార్టీలకే అధిక సీట్లు వస్తాయని.. కాబట్టి తర్వాత కాబోయే ప్రధాని ఎవరనే […]

ప్రధాని రేసులో నేనా... నో..నో..నో..

Updated on: Apr 24, 2019 | 11:45 AM

లక్నో : మహాకూటమిలో అందరూ ప్రధానమంత్రి అభ్యర్థులేనని, అసలు అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ బీజేపీ చేస్తున్న విమర్శలపై యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పందించారు. తానైతే ప్రధాని పదవి రేసులో లేనని తేల్చి చెప్పారు. తనకు అటువంటి ఉద్దేశం కూడా లేదన్న ఆయన.. దేశానికి తదుపరి ప్రధాని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయితే చాలా సంతోషిస్తానని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ కంటే ప్రాంతీయ పార్టీలకే అధిక సీట్లు వస్తాయని.. కాబట్టి తర్వాత కాబోయే ప్రధాని ఎవరనే విషయాన్ని ప్రాంతీయ పార్టీలే నిర్ణయిస్తాయని అన్నారు. దేశానికి ప్రధానిగా ఎవరు ఉండాలన్న దానిని ప్రాంతీయ పార్టీలే నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us