రౌడీయిజం.. జగన్ బ్లడ్‌లోనే ఉంది: అయ్యన్న పాత్రుడు

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్న పాత్రుడు.. సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. మీడియాతో మాటాడ్లిన ఆయన.. జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. ఆయనపై కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌ గారి బ్లడ్‌లోనే రౌడీయిజం ఉందని విమర్శించారు. విశాఖ ఎంతో ప్రశాంతంగా ఉంటుందని.. కడప ఫ్యాక్షన్ గొడవలు ఇక్కడికి తీసుకురావద్దని తెలిపారు. జగన్ పరిపాలన.. పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు. రాష్ట్రంలో.. ఇన్ని అల్లర్లు, గొడవలు జరుగుతున్నా.. ఏపీ డీజీపీ […]

రౌడీయిజం.. జగన్ బ్లడ్‌లోనే ఉంది: అయ్యన్న పాత్రుడు

Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 24, 2019 | 5:04 PM

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్న పాత్రుడు.. సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. మీడియాతో మాటాడ్లిన ఆయన.. జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. ఆయనపై కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌ గారి బ్లడ్‌లోనే రౌడీయిజం ఉందని విమర్శించారు. విశాఖ ఎంతో ప్రశాంతంగా ఉంటుందని.. కడప ఫ్యాక్షన్ గొడవలు ఇక్కడికి తీసుకురావద్దని తెలిపారు. జగన్ పరిపాలన.. పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు. రాష్ట్రంలో.. ఇన్ని అల్లర్లు, గొడవలు జరుగుతున్నా.. ఏపీ డీజీపీ సవాంగ్ మాత్రం మౌనంగా ఉన్నారని.. జగన్‌ను చూసి.. పోలీసులు కూడా రౌడీలుగా తయారవుతున్నారని ఘాటుగా విమర్శలు చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై.. వైసీపీ ప్రభుత్వం.. దొంగతనం అంటగట్టిందని.. ఆ అవమానంతో, వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.