పార్టీలు పెట్టిన మహిళలు సక్సెస్ అయ్యారా..రాజకీయాల్లో రాణించిన నారీమణులెవరు?

India Politics - Female Leaders: భారత్ లో రాజకీయ పార్టీలు పెట్టిన మహిళలు కొందరు అద్భుతంగా రాణించగా..మరికొందరు పార్టీని నడపలేక మధ్యలో కాడి కిందపడేశారు. అప్పటికే పెట్టిన పార్టీని లీడ్ చేసి సక్సెస్ సాధించిన వీర వనితలు కొందరైతే...కొత్తగా పార్టీ పెట్టి విజయభేరి మోగిస్తున్న నారీమణులు ఇంకొందరు.

పార్టీలు పెట్టిన మహిళలు సక్సెస్ అయ్యారా..రాజకీయాల్లో రాణించిన నారీమణులెవరు?
ప్రతీకాత్మక చిత్రం
Follow us

|

Updated on: Apr 17, 2021 | 11:42 AM

భారత్ లో రాజకీయ పార్టీలు పెట్టిన మహిళలు కొందరు అద్భుతంగా రాణించగా..మరికొందరు పార్టీని నడపలేక మధ్యలో కాడి కిందపడేశారు. అప్పటికే పెట్టిన పార్టీని లీడ్ చేసి సక్సెస్ సాధించిన వీర వనితలు కొందరైతే…కొత్తగా పార్టీ పెట్టి విజయభేరి మోగిస్తున్న నారీమణులు ఇంకొందరు. వైఎస్సార్ కుమార్తె షర్మిలా రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం…

జయలలిత, మమతా బెనర్జీ, మాయవతి, మెహబూబా ముప్తీ, జానకీ రామచంద్రన్ వంటి వారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోగా…సోనియాగాంధీలాంటి వాళ్లు యుపిఏను లీడ్ చేశారు. విజయశాంతి, లక్ష్మీపార్వతి, మేనకాగాంధీ, కొత్తపల్లి గీత, గౌరియమ్మ లాంటి వాళ్లు పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. ఇక పార్టీ పెట్టకుండానే రాజకీయ యవనిక నుంచి తప్పుకున్నారు శశికళ. మొత్తంగా భారత్ లో పొలిటికల్ పార్టీని లీడ్ చేయడం అతివలకు మిశ్రమ ఫలితాలిచ్చాయనే చెప్పాలి. వారెవరు ఎంత వరకు సక్సెస్ అయ్యారు మరెంత వరకు ఫైయిలయ్యారు ఇప్పుడు చూద్దాం.

1. విజయశాంతి – తల్లి తెలంగాణ పార్టీ సినీనటి, లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందారు. 1998 జనవరిలో విజయశాంతి బీజేపీలో చేరారు. 2005 మే లో బీజేపీ నుంచీ బయటకు వచ్చి..తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీని నడిపించలేక 2009 జూన్‌లో టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీలో అంతగా ఆదరణ లభించకపోవడంతో 2020 డిసెంబర్‌ లో రెండోసారి బీజేపీలో చేరారు.

2. లక్ష్మీ పార్వతి – ఎన్టీఆర్‌ తెలుగుదేశం (ఎల్పీ) 1995 టీడీపీలో నెలకొన్న సంక్షోభంతో పార్టీ మొత్తం చంద్రబాబు గుప్పెట్లోకి వెళ్లిపోయింది. జనవరి18, 1996 న ఎన్టీఆర్‌ మృతి చెందారు. ఎన్టీఆర్ రాజకీయవారసురాలిగా ప్రకటించుకున్న ఆయన రెండో భార్య లక్ష్మీ పార్వతి..ఎన్టీఆర్‌ తెలుగుదేశం (ఎల్పీ) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. 1996 లోక్‌సభ ఎన్నికలలో 42 పార్లమెంట్‌ స్థానాలలో ఆ పార్టీ పోటీ చేయగా…కేవలం 10.66 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. 1996లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఉప ఎన్నికలో లక్ష్మీ పార్వతి విజయం సాధించారు. 2012 నవంబర్‌ లో వైఎస్సార్‌సీపీలో చేరిన లక్ష్మీపార్వతి

3. ఎంజీ రామచంద్రన్ భార్య జానకి, ఏడిఎంకే పార్టీ 1987 డిసెంబరులో ఎం.జి.రామచంద్రన్(ఎంజీఆర్) మరణించాక…తమిళనాడుకు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఆయన సతీమణి జానకి ఎన్నికయ్యారు. ఎడిఎంకె పార్టీకి నాయకురాలిగా కూడా ఎన్నికయ్యారు. జనవరి 1988లో ముఖ్యమంత్రిగా పనిచేసిన జానకి..24 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత ఎడిఎంకే రెండుగా చీలిపోయింది.  ఆ తర్వాత క్రమంగా జయలలిత ఏడిఎంకేపై పట్టు సాధించగా..జానకి ప్రాభవం కోల్పోయారు.

4. కేఆర్ గౌరయమ్మ(గౌరి అమ్మ)-కేరళ భారతదేశంలోనే తొలి రెవిన్యూ మంత్రిగా కేఆర్ గౌరయమ్మకు గుర్తింపు ఉంది. పది సార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేత ఆమె. ఎల్డీఎప్ లో ఆమె చాలా కాలం పని చేశారు. 1994లో జనతిపతియా సంరక్షణ సమితి (జేఎస్ఎస్)ని ఏర్పాటు చేశారు. పార్టీని నడపలేక యునైటెడ్ డెమోక్రటిక్ ప్రంట్ లో విలీనం చేశారు.

5. జయలలిత, తమిళనాడు 1981లో జయలలిత తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించారు. ఎంజీ రామచంద్రన్ మృతి తర్వాత సిఎం పీఠం ఎక్కారు ఆయన భార్య జానకి. ఆ తర్వాత పరిణామాల్లో ఎడిఎంకే రెండుగా చీలింది. ఒక గ్రూపుకు జానకి, మరో గ్రూపుకు జయలలిత నేతృత్వంవహించారు. ఆ తర్వాత జయ ఆధ్వర్యంలో ఏఐడిఎంకేగా ఏర్పాటయ్యింది. 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి..తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం పొందారు. 1991 నుంచి 1996 వరకు సిఎంగా కొనసాగారు. 2001లో కొంత కాలం, 2002-06 వరకు సిఎంగా పని చేశారు. 2015 మే నుంచి 2016 డిసెంబరులో మరణించే దాకా సిఎంగా ఉన్నారు జయలలిత. 1991లో 168 సీట్లో పోటీ చేసి అన్నింటిలోను గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 1998 లోక్ సభ ఎన్నికల్లో 18 సీట్ల్లలో విజయం సాధించారు. 2001లో 132 అసెంబ్లీ సీట్లల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2011లో 150 అసెంబ్లీ సీట్లలో గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2014లో లోకసభ ఎన్నికలలో 39 సీట్లలో గెలుపొందారు. లోకసభలో మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించారు. 2016లో 234 సీట్లలో పోటీ చేసి 134సీట్లో గెలుపుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2016 నాటికి పార్లమెంటులో ఏఐడిఎంకే బలం (37 లోకసభ+ 13 రాజ్యసభ) 50 సీట్లకు పెరిగింది. తమిళనాడు లోని మరే రాజకీయ పక్షము సాధించని అపురూప విజయం సాధించారు.

6. శశికళ, జయలలిత అనుచరురాలు 1989నుంచి 2016 వరకు ఏఐడిఎంకేలో జయలలిత నెచ్చెలి శశికళ కొనసాగారు. డిసెంబర్ 5, 2016న జయలలిత మృతి చెందగా…అదే రోజు ఏఐడిఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు. ఫిబ్రవరి5, 2017న ఏఐడిఎంకే లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. సిఎంగా ప్రమాణం చేసేందుకు శశికళ సిద్ధమయ్యారు. ఫిబ్రవరి14, 2017న కలర్ టీవీ స్కామ్ కేసులో శశికళకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఆగస్టు 28, 2017న పార్టీ నుంచి శశికళ బహిష్కరణకు గురైయ్యారు. 2017లో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఏర్పాటు చేశారు శశికళ. శశికళను ప్రధాన కార్యదర్శిగా టిటివి దినకరన్ నియమించారు. ఫిబ్రవరి 2021న జైలు నుంచి విడుదలైన శశికళ..మార్చి3, 2021 రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.

7. మేనకా గాంధీ – రాష్ట్రీయ సంజయ్‌ మంచ్‌ ఇందిరగాంధీ చిన్న కోడలుగా, సంజయ్‌గాంధీ భార్యగా మేనకా గాంధీకి సుపరిచయముంది. 1980లో భర్త సంజయ్ గాంధీ మరణం తర్వాత అత్త ఇందిరాగాంధీతో మేనకా గాంధీకి విభేదాలు ఏర్పడ్డాయి. 1983లో రాష్ట్రీయ సంజయ్‌ మంచ్‌ పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. 1983 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి 5స్థానాలకు పోటీచేసి 4 స్థానాలలో గెలుపొందారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాజీవ్‌ గాంధీ పై పోటీ చేసి ఓటమి చెందారు. 1988లో తమ పార్టీని జనతాదళ్‌ లో విలీనం చేశారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి విపి.సింగ్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2004లో బీజేపీ చేరారు మేనకా గాంధీ

8. మాయావతి – బీఎస్‌పీ 1977లో ఐఎఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కాన్షీరాంతో మాయావతికి పరిచయం ఏర్పడింది. 1984లో బహుజన సమాజ్‌ పార్టీని కాన్షీరాం స్థాపించారు. బిఎస్‌పిలో చేరిన మాయావతి..తొలిసారి కైరానా నుండి లోక్‌సభకు పోటీ చేసి ఓటమి చెందారు. 1995లో పార్టీ నాయ‌క‌త్వాన్నిమాయావతికి అప్ప‌గించారు కాన్షీరాం. 1989లో బిజ్నోర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి తొలిసారిగా మాయావతి లోక్‌స‌భ‌లో అడుగు పెట్టారు. 1994లో రాజ్య‌స‌భ‌కు ఎన్నికయ్యారు. 1998-2004 మ‌ధ్య కాలంలో అక్బ‌ర్‌పూర్ నుంచి మూడు సార్లు లోక్‌స‌భకు ఎన్నికయ్యారు. 1995,1997,2002లలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు మాయావతి.

9. మమతా బెనర్జీ – తృణమూల్‌ కాంగ్రెస్‌ 1970 నుంచి 1997 వరకూ పశ్చిమబెంగాల్‌ కాంగ్రెస్‌ రాజకీయాల్లో మమతా బెనర్జీ కీలకపాత్ర పోషించారు. 1997లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించారు. 2009-2011 మధ్య మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో కేంద్ర రైల్వే మంత్రిగా మమత (సంకీర్ణ ప్రభుత్వం) పనిచేశారు. 2011 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించి అధికారం కైవసం చేసుకున్నారు. 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడారు దీదీ. అప్పటి నుంచీ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మమతా బెనర్జీ..2016లో రెండోసారి సిఎంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం  మూడోసారి అధికారం కోసం రాజకీయ ఎత్తులు వేస్తున్నారు.

10. మెహబూబా ముఫ్తీ – పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పిడిపి) 1999లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ లో పీడీపీ ని ముఫ్తీ మొహమ్మద్ సయీద్ స్థాపించారు. 1996 నుంచే రాజకీయాల్లో తండ్రికి తోడుగా ఉన్నారు మెహబూబా ముఫ్తీ. 2004లోనూ, 2014లోనూ అనంతనాగ్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2016లో ఆమె తండ్రి మరణంతో పార్టీ బాధ్యతలు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు మెహబూబా ముఫ్తీ. 2018 జూన్‌ వరకూ ముఖ్యమంత్రిగా పనిచేశారు మెహబూబా.

11. సోనియా గాంధీ – కాంగ్రెస్‌ 1991లో భర్త రాజీవ్‌ గాంధీ మృతితో సోనియాగాంధీ రాజకీయ ప్రవేశించారు. 1997 వరకూ తెరవెనుక రాజకీయాలకే పరిమితమయ్యారు. 1998లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతల స్వీకారించారు. 1999 నుంచీ 2006 వరకూ ఉత్తరప్రదేశ్‌ లోని అమేథీ నుంచీ ఎంపీగా సోనియా విజయం సాధించారు. 2006 నుంచీ రాయ్‌బరేలీ నుంచీ ఎన్నికయ్యారు. 2004-2014 మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో కుమారుడు రాహుల్‌ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా చేశారు సోనియా గాంధీ.

12. కొత్తపల్లి గీత రాజకీయ పార్టీ – జనజాగృతి గ్రూప్‌-1 అధికారిగా ప్రభుత్వ శాఖలలో వివిధ హోదాలలో పనిచేసిన కొత్తపల్లి గీత2014లో వైఎస్సార్‌సీపీలో చేరి అరకు నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కొన్నాళ్లు టీడీపీ ప్రభుత్వంతో సన్నిహితంగా కార్యక్రమాలు నిర్వహించారు. 2018 అగస్టులో జనజాగృతి పేరుతో సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.  పార్టీ నడిపేందుకు ఇబ్బందులు పడ్డారు. 2019 జూన్‌లో బీజేపీలోచేరారు కొత్తపల్లి గీత.

13. రబ్రీదేవి, లాలూ ప్రసాద్ యాదవ్ భార్య బీహర్ సిఎంగా, కేంద్ర మంత్రిగా పని చేసిన లాలూ ప్రసాద్ యాదవ్. భర్త సిఎంగా ఉండగా ఇల్లాలుగానే ఉన్నారు ఆయన సతీమణి రబ్రీదేవి.  సిఎంగా ఉన్నప్పుడు దాణా స్కాం కేసులో ఇరుక్కున్నారు లాలూ. లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లడంతో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కు రబ్రీ దేవి నేతృత్వం వహించారు. 1997 నుంచి 2005 మధ్యలో మూడు సార్లు ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు రబ్రీదేవి.

(కొండవీటి శివనాగ్ రాజు, సీనియర్ జర్నలిస్టు)

ఇవి కూడా చదవండి..పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మహేష్ ట్వీట్.. ఆనందం వ్యక్తం చేస్తున్న అభిమానులు

పాకిస్తాన్ క్రికెటర్లకు గూడ్ న్యూస్ చెప్పిన భారత ప్రభుత్వం.. అభిమానులకు పండగే పండుగ..

Latest Articles
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు
నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు
ఆ రాష్ట్రంలో ఆలయాల్లో కరివేరు పువ్వులవాడడంపై నిషేధం రీజన్ ఏమిటంటే
ఆ రాష్ట్రంలో ఆలయాల్లో కరివేరు పువ్వులవాడడంపై నిషేధం రీజన్ ఏమిటంటే
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!