రాయబరేలిలో సోనియాగాంధీ నామినేషన్

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ స్థానానికి గురువారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. తన కుమారుడు…కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా వెంటరాగా ఆమె రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాయబరేలి సిట్టింగ్ ఎంపీ అయిన సోనియాగాంధీ ఇవాళ ఉదయం రాయబరేలిలోని పార్టీ కార్యాలయంలో హోమం నిర్వహించారు. అనంతరం 700 మీటర్ల మేర జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. రాయబరేలి నుంచి […]

రాయబరేలిలో సోనియాగాంధీ నామినేషన్
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2019 | 4:07 PM

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ స్థానానికి గురువారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. తన కుమారుడు…కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా వెంటరాగా ఆమె రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాయబరేలి సిట్టింగ్ ఎంపీ అయిన సోనియాగాంధీ ఇవాళ ఉదయం రాయబరేలిలోని పార్టీ కార్యాలయంలో హోమం నిర్వహించారు. అనంతరం 700 మీటర్ల మేర జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు.

రాయబరేలి నుంచి వరుసగా నాలుగు సార్లు సోనియాగాంధీ గెలిచారు. ఐదోసారి కూడా ఆమె బరిలోకి దిగుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యంగా యూపీ పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఇక్కడ సోనియాగాంధీకి ప్రత్యర్థిగా ఇటీవలే బీజేపీలో చేరిన దినేష్ సింగ్‌ను బీజేపీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం తమ అభ్యర్థులను నిలబెట్టడం లేదు.