ఏపీ ఎన్నికలపై బండారు జోస్యం

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా చంద్రబాబు పర్యటన వలన.. బీజేపీకి లాభమే కానీ నష్టం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ 300కు పైగా సీట్లు గెల్చుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తాయి కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల కోసం హడావిడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిజామాబాద్‌లో ఎంపీ […]

ఏపీ ఎన్నికలపై బండారు జోస్యం

Updated on: Apr 22, 2019 | 3:08 PM

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా చంద్రబాబు పర్యటన వలన.. బీజేపీకి లాభమే కానీ నష్టం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ 300కు పైగా సీట్లు గెల్చుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తాయి కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల కోసం హడావిడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిజామాబాద్‌లో ఎంపీ కవిత ఓటమి అంచుల్లో ఉన్నారని ఆయన అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us