పెద్దల సభ ఎన్నికల్లో పోటాపోటీ రాజకీయం

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జరుగుతున్న ఎన్నికలతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. సంఖ్యాబలం ఉందని భావిస్తున్న ఎన్డీఏ సారథి బీజేపీ.. తటస్థ పక్షాలను కూడగట్టుకొని తగిన మెజారిటీతో డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తుండగా, విపక్షాలు...

పెద్దల సభ ఎన్నికల్లో పోటాపోటీ రాజకీయం
Follow us

|

Updated on: Sep 11, 2020 | 11:27 AM

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జరుగుతున్న ఎన్నికలతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. సంఖ్యాబలం ఉందని భావిస్తున్న ఎన్డీఏ సారథి బీజేపీ.. తటస్థ పక్షాలను కూడగట్టుకొని తగిన మెజారిటీతో డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తుండగా, విపక్షాలు కూడా తామేమి తక్కువ తినలేదు అన్నట్లుగా ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ పార్టీలతోపాటు బీజేపీని వ్యతిరేకించే కొన్ని పార్టీలు కూడా కలిపి ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝాని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల బరిలో నిలిపాయి.

అధికార ఎన్డీఏ కూటమి తరపున జేడీయూ ఎంపీ హరివంశ్ సింగ్ బరిలో నిలవగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా పోటీకి దిగారు. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని విపక్ష కూటమిలో సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, శివసేన, జేఎంఎం, కేరళ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వంటి పార్టీలు విపక్షాల కూటమి అభ్యర్థి మనోజ్ ఝాకు మద్దతు ప్రకటించాయి.

అటు ఎన్డీఏకు, ఇటు యూపీఏకు సమాన దూరం పాటిస్తున్న బిజూ జనతాదళ్, తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలు ఇపుడు కీలక మయ్యారు. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నేతలతో పాటు ఎన్డీయేలో కీలకంగా వ్యవహరిస్తున్న జేడీయు నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తటస్థ పార్టీలతో మంతనాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా నితీష్ కుమార్.. బీజూ జనతాదళ్ అధినేత, ఒడీషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమాలోచనలు జరిపారు. బీజేడీ మద్దతు కోరారు.

మరోవైపు తటస్థ పార్టీలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావుకు ముందుగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసి యూపీఏ పక్షాన పోటీ చేయాల్సిందిగా అభ్యర్థించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను టీఆర్ఎస్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మద్దతు కోసం బీజేపీ రంగంలోకి దిగింది. టీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.

టీఆర్ఎస్ పార్టీకి ఏడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు రాజ్యసభ సభ్యుల బలం ఉండగా వీరి మద్దతు అటు ఎన్డీయే, ఇటు యుపీఏ పక్షాల డిప్యూటీ చైర్మన్ అభ్యర్థులకు కీలకం కానుంది. అయితే యూపీఏ కూటమి బలం 91 కాగా మరో రెండు పార్టీలను కలుపుకుంటే ఈ నెంబర్ 95కు చేరే అవకాశాలున్నాయి. మరోవైపు సొంతంగా 87 మంది రాజ్యసభ సభ్యుల బలం కలిగిన అధికార బీజేపీ.. తమ మిత్రపక్షాలతో కలిపి మొత్తం 101 రాజ్యసభ సభ్యుల బలంతో జేడీయూ అభ్యర్థిని బరిలోకి దింపింది. అదే సమయంలో బీజేడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మద్దతు కూడా తమకేనన్న ధీమాలో ఎన్డీయే కూటమి నేతలు ఉన్నారు. ఈ తటస్థ పార్టీలను కూడా కలుపుకుంటే తగిన మెజారిటీతో తమ అభ్యర్థిని డిప్యూటీ ఛైర్మెన్‌గా గెలిపించుకుంటామని కమలనాథులు భావిస్తున్నారు.

ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులకుగాను 244 మంది ఎంపీలు ఉండగా 123 మంది మద్దతు పొందిన వారికి డిప్యూటీ చైర్మన్ పదవి దక్కుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీయే కూటమి బలం 91 కాక బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీల ఎంపీలను కలిపితే వారి బలం 95కు చేరుతుంది. అయితే ఈ రెండు పార్టీలు యూపీఏ కూటమికి మద్దతు ఇంకా తెలపలేదు. అటు అధికార కూటమికి 101 రాజ్యసభ సభ్యుల బలం ఉండగా తటస్థ పార్టీలను కూడా కలుపుకొని ఈజీగా డిప్యూటీ చైర్మన్ గెలిపించుకుంటామని కమలనాథులు భావిస్తున్నారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో దేశ రాజధాని రాజకీయాలు వేడెక్కాయి. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక పోటీ లేకుండా జరగ రాదన్న ఉద్దేశంతోనే సంఖ్యా బలం లేకపోయినా అభ్యర్థిని బరిలోకి దింపామని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది పరోక్షంగా ఓటమిని అంగీకరించడమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇదిలా ఉండగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా పోటీ చేస్తున్న హరివంశ్ సింగ్, మనోజ్ ఝా లిరువురు బీహార్ రాష్ట్రానికి చెందిన వారే కావడం విశేషం.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..