395 మంది కర్నాటక పోలీసులకు కరోనా

బెంగుళూరు నగరంలో ఇప్పటి వరకు 395 మంది పోలీసులు కరోనా బారినపడినట్టు ఐజీ, అడిషనల్ కమిషనర్ హేమంత్ నింబాల్కర్ తెలిపారు. వీరిలో 190 మంది కోలుకోగా, 200 మంది చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. అలాగే, 20 పోలీస్ స్టేషన్లను మూసివేసినట్లు తెలిపారు.

395 మంది కర్నాటక పోలీసులకు కరోనా
Follow us

|

Updated on: Jul 09, 2020 | 6:39 PM

కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న కర్నాటకలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. కొవిడ్ నియంత్రణకు ముందు వరుసలో ఉండి పోరాడుతున్ ఫ్రంట్ వారియర్స్ సైతం కరోనా కాటుకు గురవుతున్నారు. తాజాగా బెంగుళూరు నగరంలో ఇప్పటి వరకు 395 మంది పోలీసులు కరోనా బారినపడినట్టు ఐజీ, అడిషనల్ కమిషనర్ హేమంత్ నింబాల్కర్ తెలిపారు. వీరిలో 190 మంది కోలుకోగా, 200 మంది చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. అలాగే, 20 పోలీస్ స్టేషన్లను మూసివేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ విధులు నిర్వర్తించడంలో ఇతర విభాగాలతో పోలిస్తే బెంగళూరు పోలీసులు ముందున్నారని పేర్కొన్నారు.

వైరస్ నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో శిక్షణ ఇచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ఈ మహమ్మారి బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులతో పాటు వారి కుటుంబాలకు కూడా వైరస్ ముప్పు పొంచి ఉందని ఐజీ హెచ్చరించారు. కాగా, బెంగళూరులోని వీవీపురం పోలీస్ స్టేషన్‌ ఏఎస్సై జూన్ 13న కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అతనికి గుండె సంబంధిత సమస్యతో ఆయన ఇంటి వద్ద ఒక్కసారిగా కుప్పకూలి మరణించారు. అనంతరం కొవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బెంగళూరులో కరోనాతో చనిపోయిన తొలి పోలీసు ఆయనేనని నింబాల్కర్ వెల్లడించారు.