ఘన్‌పూర్‌ తల్లీకొడుకుల హత్య కేసులో వెలుగుచూసిన సంచలన నిజాలు.. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

వ‌య‌స్సులో త‌న క‌న్న పెద్దది అయిన మ‌హిళ‌తో స‌హజీవ‌నం చేసి అనుమానంతో ఆమెను, ఆమె కొడుకును హతమార్చాడు ఓ కసాయి.

ఘన్‌పూర్‌ తల్లీకొడుకుల హత్య కేసులో వెలుగుచూసిన సంచలన నిజాలు.. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
Follow us

|

Updated on: Jan 04, 2021 | 4:31 PM

అనుమానం య‌మ‌పాశం అయింది… ఇద్దరి ప్రాణాలను బలి తీసింది.. ఒక‌రిని జైలు పాలు చేసింది.. వ‌య‌స్సులో త‌న క‌న్న పెద్దది అయిన మ‌హిళ‌తో స‌హజీవ‌నం చేసి అనుమానంతో హతమార్చాడు ఓ కసాయి. నిజామాబాద్ జిల్లాలో వ‌ర్నీ మండలం ఘన్‌పూర్‌లో తల్లీకొడుకులు దారుణహత్య జిల్లాలో సంచ‌ల‌నం సృష్టించింది..త‌న‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నా మ‌హిళ‌ను గొడ్డలితో నరికి చంపి అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టాడు. కుటుంబ స‌భ్యులు ఆరా తీయ‌డంతో.. నిందితుడు చివ‌రికి నేరాన్ని ఓప్పుకుని పోలిసుల‌ ముందు లొంగిపోయాడు…

బోధన్‌ డివిజన్‌ పరిధిలోని చందూర్‌ మండలం ఘన్‌పూర్‌ అటవీ ప్రాంతంలో దారుణం జరిగింది. తల్లి, కొడుకును ఒకేసారి హతమార్చిన సంఘటన వెలుగు చూసింది. హూమ్నాపూర్‌ గ్రామానికి చెందిన సుంకరి సుజాత, ఆమె రెండేండ్ల కుమారుడు రాము అటవీ ప్రాంతంలో హత్యకు గురయ్యారు. తల్లీకొడుకులను ఘన్‌పూర్‌ అటవీ ప్రాంతంలో సుజాతతో స‌హ‌జీవ‌నం చేస్తున్న రాములు దారుణానికి ఒడిగట్టాడు. సుజాత మృతదేహాన్ని లోతైన గ్రామానికి కిలోమీటరన్నర దూరంలో ఉన్న ఆడవిలో ఉన్న ఒర్రెలో వేసి పైన మట్టి, ఆకులు, కొమ్మలు కప్పివేశాడు. పక్కనే ఆమె రెండేండ్ల కుమారుడి మృతదేహాన్ని మట్టితో పూడ్చేశాడు.

ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన చెవిటి రాములు నాలుగేళ్లుగా హుమ్నాపూర్‌ గ్రామానికి చెందిన సుజాతతో సహజీవనం చేస్తున్నారు. ఘన్‌పూర్‌, హుమ్నాపూర్‌ గ్రామాలు పక్కపక్కనే అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉంటాయి. సుజాత ప్రతిరోజూ అటవీ ప్రాంతానికి వెళ్లి కట్టెలు సేకరించేది. రాములు ఘన్‌పూర్‌లో పాలేరుగా పనిచేసేవాడు. ఇలా వీరు అడవిలో తరచుగా కలుసుకునేవారు. డిసెంబర్‌ 31న పథకం ప్రకారం రాములు సుజాతను, ఆమె కుమారుడిని కట్టెల కొడుదామని చెప్పి అడవికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కట్టెలు కొట్టేందుకు తెచ్చిన గొడ్డలితో వారిద్దరినీ హత్య చేశాడు.. మృతదేహాలను అక్కడే కప్పిపెట్టి ఊరిలోకి వ‌చ్చేశాడు రాములు.

ఇదిలావుండగా, సుజాత జాడ కనిపించకపోవడంతో ఆమె త‌ల్లి రాములును ప్రశ్నించింది. సరియైన సమాధానం రాకపోవడంతో గట్టిగా నిలదీసింది.. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సుజాత తల్లి పోలీసుల‌కు పిర్యాదు చేయ‌డంతో రాములును అదుపులోకి తీసుకుని మృతదేహాలను పాతిపెట్టిన గుట్టపైకి వెళ్లి బ‌య‌టికి తీశారు.చ‌నిపోయి నాలుగు రోజులు కావ‌డంతో మృతదేహాలు కుళ్లిపోయాయి. అక్కడే పంచనామా నిర్వహించిన పోలీసులు రాములుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే, సూజ‌త మరొకరితో చ‌నువుగా ఉండ‌టం వ‌ల్లే రాములు హత్యకు పాల్పడినట్లు పోలిసులు తెలిపారు. పక్క ప్లాన్‌తో గుట్టపైకి క‌ట్టేలు తెచ్చుకుందామని తీసుకువ‌చ్చి నిర్మానుష్యా ప్రాంతంలో సుజాతను, ఆమె కొడుకును గొడ్డలితో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గ‌త కొద్ది కాలంగా సహాజీవనం చేస్తున్న వీరికి ఎడాదిన్నర కొడుకు కూడా ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోధన్ ఏసీపీ తెలిపారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?