వేట కొడవళ్లతో బీభత్సం.. నెల్లూరు మార్కెట్‌ యార్డులో ఒక్కసారిగా అలజడి.. అసలు ఏం జరిగిందంటే..

రద్దీగా ఉండే చోటు కత్తులతో కొట్లాట. నెల్లూరు మార్కెట్‌ యార్డులో దుందగుల హల్‌చల్‌. సడెన్‌గా వచ్చారు. ఉన్నట్టుండి గొడవ పడ్డారు. కొందరు పొడవాటి కత్తులు బయటకు తీశారు. అటాక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు.

వేట కొడవళ్లతో బీభత్సం.. నెల్లూరు మార్కెట్‌ యార్డులో ఒక్కసారిగా అలజడి.. అసలు ఏం జరిగిందంటే..
Follow us

|

Updated on: Nov 21, 2020 | 11:12 PM

Nellore Market Yard :  రద్దీగా ఉండే చోటు కత్తులతో కొట్లాట. నెల్లూరు మార్కెట్‌ యార్డులో దుందగుల హల్‌చల్‌. సడెన్‌గా వచ్చారు. ఉన్నట్టుండి గొడవ పడ్డారు. కొందరు పొడవాటి కత్తులు బయటకు తీశారు. అటాక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరికొందరేమో ఉట్టి చేతులతోనే ఫైటింగ్‌కు దిగారు. గుర్తు తెలియని దుండగుల గ్యాంగ్‌ వార్‌తో నెల్లూరు మార్కెట్‌ యార్డులో హైటెన్షన్‌.

అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. ఎవరు గొడవ పడుతున్నారో.. ఎందుకు దాడి చేసుకుంటున్నారో.. అక్కడ ఎవరికీ తెలీదు. కొన్ని నిమిషాల వరకూ మార్కెట్‌ యార్డ్‌లో కత్తులతో బీభత్సకాండ కొనసాగింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రీల్‌ సీన్‌లోకి రియల్‌ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

అప్పటిదాకా కత్తులు పట్టుకొని హంగామా చేసిన వారంతా.. ఖాకీలను చూసి సైలెంట్‌ అయ్యారు. పోలీసులు గట్టిగా ప్రశ్నిస్తే.. ఇదంతా రియల్‌ ఫైటింగ్‌ కాదని.. ఓ సినిమా షూటింగ్‌ కోసం ఇలా మార్కెట్‌లో ఓవరాక్షన్‌ చేశారని తేలింది. ఒళ్లుమండిన పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఎలాంటి పర్మిషన్లు లేకుండా.. నెల్లూరు మార్కెట్‌ యార్డులో జనాలను భయాందోళనలకు గురి చేసిన సినిమా నటులను అదుపులోకి తీసుకున్నారు. చూస్తుంటే, వాళ్లంతా షార్ట్‌ ఫిల్మ్‌ బ్యాచ్‌ అని తేలింది. చేతిలో కెమెరా ఉంటే చాలు.. ఏదైనా చేసేయొచ్చనే బ్యాచ్‌కు నెల్లూరు పోలీసులు చెక్ పెట్టారు. సినిమా షూటింగ్స్‌కు కూడా కొన్ని రూల్స్‌, పర్మిషన్స్‌ ఉంటాయనే విషయాన్ని పోలీసుల భాషలో అర్థమయ్యేలా వివరించారు. వీరు చేసిన ఓవరాక్షన్‌కు ఖాకీలు గట్టి బుద్దే చెప్పారు. ఇంతకీ, ఆ సినిమా పేరు ఏంటో తెలుసా? మద్రాస్‌ బస్టాండ్‌.. ఆ తర్వాత పోలీసుల విచారణలో ఆ నటులు తెలిపారు.

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..