మెడలో రుద్రాక్షలు.. సరికొత్త వేషధారణలో మోదీ

ప్రధాని మోదీ తీర్థయాత్రకు వెళ్లారు. ప్రత్యేక హెలికాప్టర్లో కేదార్‌నాథ్ చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రధాని పదవిని చేపట్టాక కేదార్‌నాథ్ ఆలయాన్ని మోదీ దర్శించుకోవడం ఇది నాలుగోసారి కావడం విశేషం. తలపై టోపి, చేతిలో కర్రతో ప్రత్యేక వేషాధారణలో మోదీ కేదార్‌నాథ్‌ను సందర్శించుకోవడం విశేషం. కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఐదురోజుల ముందు కేదార్‌నాథ్ యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మోదీ యాత్రకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ […]

మెడలో రుద్రాక్షలు.. సరికొత్త వేషధారణలో మోదీ
Follow us

| Edited By:

Updated on: May 18, 2019 | 11:54 AM

ప్రధాని మోదీ తీర్థయాత్రకు వెళ్లారు. ప్రత్యేక హెలికాప్టర్లో కేదార్‌నాథ్ చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రధాని పదవిని చేపట్టాక కేదార్‌నాథ్ ఆలయాన్ని మోదీ దర్శించుకోవడం ఇది నాలుగోసారి కావడం విశేషం. తలపై టోపి, చేతిలో కర్రతో ప్రత్యేక వేషాధారణలో మోదీ కేదార్‌నాథ్‌ను సందర్శించుకోవడం విశేషం. కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఐదురోజుల ముందు కేదార్‌నాథ్ యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మోదీ యాత్రకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల తుదిదశ పోలింగ్ ఆదివారం జరగనుంది. అయితే మోదీ కేదార్‌నాథ్ దర్శనం కూడా కోడ్ ఉల్లంఘనే అవుతుందని విపక్షాలు వాదిస్తున్నాయి. కానీ ఎన్నికల సంఘం మాత్రం విపక్షాల వాదనను తోసిపుచ్చింది. దీంతో మోదీ యాత్రకు రూట్ క్లియర్ అయ్యింది.

కేదార్‌నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేపట్టారురు. అనంతరం బనీ గుహలో ధ్యానం చేశారు. అంతేకాకుండా పరమశివుడికి రుద్రాభిషేకం కూడా నిర్వహించారు. రేపు బద్రీనాథ్‌ను దర్శించుకోనున్నారు.

కేదార్‌నాథ్ ఆలయ పునర్ నిర్మాణ పనులను ప్రధాని పరిశీలించారు. వరదల కారణంగా దెబ్బతిన్న కేదార్‌నాథ్ ఆలయానికి పునర్‌వైభవం తీసుకొస్తానని మోదీ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు సమయం చిక్కినప్పుడల్లా ఆయన కేదార్‌నాథ్‌కు వెళ్తూ.. పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. కేదార్‌నాథ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై కూడా సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Latest Articles