రాష్ట్రంలో ప్లాస్టిక్ బ్యాన్ … సీఎం కేసీఆర్ నిర్ణయం

ఇకపై నో ప్లాస్టిక్ అంటున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ దీనిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చదిద్దేందుకు ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేదిస్తున్నట్టు ప్రగతి భవన్‌లో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు. పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న ప్లాస్టిక్‌ను నిషేదించాలని, మానవాళికి విఘాతంగా మారిన ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని తెలిపారు. దీనికి అవసరమైన విధివిధానాలను ఖరారు చేయాలని ఆదేశించారు. […]

రాష్ట్రంలో ప్లాస్టిక్ బ్యాన్ ... సీఎం కేసీఆర్ నిర్ణయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 10, 2019 | 5:52 PM

ఇకపై నో ప్లాస్టిక్ అంటున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ దీనిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చదిద్దేందుకు ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేదిస్తున్నట్టు ప్రగతి భవన్‌లో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు. పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న ప్లాస్టిక్‌ను నిషేదించాలని, మానవాళికి విఘాతంగా మారిన ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని తెలిపారు. దీనికి అవసరమైన విధివిధానాలను ఖరారు చేయాలని ఆదేశించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద దీన్ని అమలుచేయాలని సూచించారు సీఎం కేసీఆర్. ప్లాస్టిక్‌ను నిషేదిస్తూ కేబినెట్ భేటీలో ఉత్తర్వులు జారీచేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో కేంద్రం నుంచి అవార్డులు పొందిన పలు జిల్లాల కలెక్టర్లను ఆయన అభినందించారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ విఙ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీ 150 జయంతి సందర్భంగా ఇది అమలు కావాలన్నారు. తాజాగా సీఎం కేసీఆర్ కూడా ప్లాస్టిక్‌ నిషేధంపై నిర్ణయం తీసుకోవడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!