మద్యం ప్రియులకు పిడుగులాంటి వార్త.. అలా తెరిచారో లేదో.. ఇలా..!

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో గత నలభై రోజులుగా దేశ వ్యాప్తంగా లిక్కర్ షాపులు మూతపడ్డాయి. ఈ క్రమంలో మూడు విడత లాక్‌డౌన్ ప్రకటించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్నింటికి సడలింపులనిచ్చింది. ఈ సడలింపుల్లో మద్యం దుకాణాలు ఓపెన్‌ చేసుకోవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్చనిచ్చింది. దీంతో సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. అయితే ఈ క్రమంలో మద్యం దుకాణాల వద్ద సందడి […]

మద్యం ప్రియులకు పిడుగులాంటి వార్త.. అలా తెరిచారో లేదో.. ఇలా..!
Follow us

| Edited By:

Updated on: May 06, 2020 | 7:58 PM

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో గత నలభై రోజులుగా దేశ వ్యాప్తంగా లిక్కర్ షాపులు మూతపడ్డాయి. ఈ క్రమంలో మూడు విడత లాక్‌డౌన్ ప్రకటించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్నింటికి సడలింపులనిచ్చింది. ఈ సడలింపుల్లో మద్యం దుకాణాలు ఓపెన్‌ చేసుకోవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్చనిచ్చింది. దీంతో సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. అయితే ఈ క్రమంలో మద్యం దుకాణాల వద్ద సందడి నెలకొంది. లిక్కర్ కోసం  భారీ క్యూలైన్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అనేక రాష్ట్రాలు మద్యంపై భారీగా రేట్లను పెంచేశాయి. అయినప్పటికీ.. మద్యం ప్రియులు వెనుకడుగు వేయడం లేదు. అయితే ఇప్పుడు ఈ మద్యం  ప్రియులకు షాకింగ్ న్యూస్ గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని.. ఈ క్రమంలో మద్యం షాపుల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందనే ఆందోళన నేపథ్యంలో.. తెరిచిన లిక్కర్ షాపులను మూసేయాలని ఆదేశించాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సివిల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఓ ప్రభుత్వేతర సంస్థ ఈ పిల్‌ను ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో దేశ రాజధాని నగరం ఢిల్లీలో మద్యం షాపులను తెరవడం ప్రజల జీవితాలతో చెలగాటమాడటమేనంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. మద్యం షాపులు తెరవడం వల్ల.. లాక్‌డౌన్ నిబంధనల ద్వారా ఓ కొలిక్కి వచ్చిన వ్యవస్థ మొత్తం దెబ్బతింటోందని పేర్కొంది. ఢిల్లీ సర్కార్‌ ఎలాంటి ప్రణాళిక లేకుండానే లిక్కర్ షాప్స్‌ ఓపెన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ప్రజలు రద్దీగా ఒక చోట చేరకుండా చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని తెలిపింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఢిల్లీ సర్కార్‌దేనని.. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉందని తెలిపింది. అయితే మద్యం ధరలను డెబ్బై శాతం పెంచినప్పటికీ.. లిక్కర్ ప్రియులు కొనేందుకు వెనుకడుగు వేయడం లేదని.. సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదంటూ కోర్టుకు తెలిపింది.