
ఏనుగులు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అత్యంత తెలివైనవి. ఇవి గుంపులుగా జీవిస్తాయి, ఇంకా తమ పిల్లలను కూడా మంచిగా చేసుకుంటాయి. ఇవి ఒకదానితో ఒకటి మంచి బంధాలను కలిగి ఉంటాయి. నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఈ సందర్భంగా వీటి గురించి ముఖ్య విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఇంకా గాయపడిన తోటి ఏనుగును కూడా ఇది ఓదార్చుతుంది ఇంకా చనిపోయిన గుంపులోని సభ్యుని కోసం ఇది బాధ పడుతుంది ఈ ప్రవర్తన కొన్నిసార్లు మానవులకు కూడా ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంతేకాదు ఇవి వేరే ఏనుగులను తమ తొండాలతో తాకడం, ఇంకా మెల్లగా శబ్దాలు చేస్తూ వాటిపక్కన ఉంటాయి.

ఏనుగుల గుంపులో ఒకటి చనిపోతే అవి కూడా వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటి గురించి ముఖ్య విషయాలు చెప్పాలంటే ఇవి మృతదేహాన్ని కూడా తాకుతాయి. ఇంకా వాటి దగ్గరే ఉంటాయి. కొన్నిసార్లు వీటి అవశేషాల వద్దకు కూడా అవి మళ్ళీ వెళ్తాయి. వీటి మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

తమ గుంపులో ఏదైనా ఏనుగు గాయపడితే అవి వేరే ఏనుగులు సహాయం చేస్తాయి. అంతే కాదు అవి కూడా అండగా ఉంటాయని అంటున్నారు. ఇవి వాటికి దగ్గరగా ఉండటం, కదలడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తాయని పరిశోధనల్లో తేలింది. గుంపులో ఒక ఏనుగు బలహీనంగా ఉంటే వాటితో కలిసి ఇంకా దగ్గరగా ఉంటాయి

ఏనుగులకు జ్ఞాపకశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఒకసారి ఏనుగులను చూస్తే మళ్ళీ ఎక్కడైనా కనిపించినా అవి గుర్తు పట్టగలవు. అంతేకాదు శబ్దాలు, వాసనలు, ఇంకా ఇతర సంకేతాల వలన కూడా ఇవి ఏనుగుల మధ్య తేడాను గుర్తించగలవు. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మనుషులు చేసినట్టే చేస్తున్నాయి.