Neeraj Chopra: భారత్‌ అథ్లెటిక్‌ నీరజ్‌ చోప్రా కెరీర్‌లో అతిపెద్ద అచీవ్‌మెంట్‌ అదే..

|

Jul 24, 2022 | 10:04 AM

ఏడాది క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి భారత్ ప్రతిష్టను నిలబెట్టిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో రికార్డు కొట్టాడు. అమెరికాలోని యూజీన్‌లో జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ..

1 / 6
ఏడాది క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి భారత్ ప్రతిష్టను నిలబెట్టిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో రికార్డు కొట్టాడు. అమెరికాలోని యూజీన్‌లో జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ నీరజ్ 88.13 మీటర్ల మేర జావలిన్‌ విసిరి సిల్వర్‌ మెడల్‌ సాధించి చరిత్ర సృష్టించాడు.

2 / 6
నీరజ్ తొలిసారిగా 2016లో భారత క్రీడారంగంలో చరగని ముద్రవేశాడు. ఆ తర్వాత పోలాండ్‌లో జరిగిన అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ (వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్)లో నీరజ్ బంగారు పతకం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నీరజ్ జావలిన్‌ (javelin throw) 86.48 మీటర్ల దూరం విసిరి సరికొత్త జాతీయ రికార్డు సృష్టించడమే కాకుండా, జూనియర్ ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

3 / 6
ఆ మరుసటి ఏడాది అంటే 2017లో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. భువనేశ్వర్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ 85.23 మీటర్ల వరకు జావెలిన్ విసిరి స్వర్ణం సాధించింది.

4 / 6
ఇక 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో అంత కంటే పెద్ద విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన గేమ్స్‌లో నీరజ్‌ ఏకపక్షంగా 86.47 మీటర్లతో స్వర్ణం సాధించాడు.

5 / 6
ఇది సాధించిన నెల రోజుల తర్వాత 2018 జకార్తా ఆసియాడ్‌లో కూడా నీరజ్ స్వర్ణం సాధించడమే కాకుండా 88.06 మీటర్లతో తన జాతీయ రికార్డును మళ్లీ బద్దలు కొట్టాడు.

6 / 6
3 యేళ్ల తర్వాత.. నీరజ్ కెరీర్‌లోనేకాకుండా భారతీయ అథ్లెటిక్స్ చరిత్రలోనే అతిపెద్ద విజయం సాధించాడు. ఆగస్టు 7, 2021 చారిత్రాత్మక రోజున.. అథ్లెటిక్స్‌లో ఏ భారతీయ క్రీడాకారుడు సాధించలేనిది నీరజ్ చోప్రా సాధించాడు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో నీరజ్ 87.58 మీటర్ల దూరం నుండి జావెలిన్ విసిరి బంగారు పతకాన్ని గెలుచుకుని గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు.