ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. ఈ రెండు కూరగాయలను అస్సలు కలిపి పెట్టొదట.. ఎందుకంటే?

Updated on: Sep 13, 2026 | 2:05 PM

చాలా మంది మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలను స్టాండ్‌లో ఉంచి నిల్వ చేస్తారు. అయితే కొన్ని ప్లేస్ లేకపోవడంతో ర్యాక్‌లో రెండు మూడు కూరగాయలు పెడుతుంటారు. అయితే మనం వంటలో ఎక్కువగా వాడే ఉల్లిపాయలు, బంగాళాదుంపలను మాత్రం ఎప్పుడూ ఒకే దగ్గర కలిపి పెట్టవద్దని నిపుణులు చెబుతున్నారు. మరీ ఎందుకు అలా పెట్టకూడదు.. అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ క్లారిటీ తెలుసుకుందాం.

1 / 5
 మార్కెట్‌ నుంచి తెచ్చిన వెంటనే కూరగాయలను ఒక ర్యాక్‌లో వేసేస్తుంటారు జనాలు. అయితే కొందరు వాటిని సపరేట్ చేసి నిల్వ చేస్తే.. మరి కొందరు మాత్రం అన్నింటిని ఇకే దగ్గర పెడుతుంటారు. ముఖ్యంగా ఉల్లిపాయలు, ఆలుగడ్డలను ఇలా స్టోర్ చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అవి త్వరగా పాడయ్యయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

2 / 5
ఉల్లిపాయలను విడిగా ఎందుకు ఉంచాలి?: ఉల్లిపాయలను ఎప్పుడూ విడిగా గాలితగిలేలా, చల్లగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే పెట్టాలి. ఎందుకంటే ఉల్లిపాయల్లో తేమ ఎక్కువైతే అవి బూజు పట్టడం లేదా కుళ్ళిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. వీలైతే వీటి కోసం ప్రత్యేకంగా దొరికే జాలిలో నిల్వ చేయాలని సూచిస్తున్నారు.

3 / 5
బంగాళాదుంపలతో కలిపి ఎందుకు పెట్టకూడదు?: నార్మల్‌గా బంగాళదుంపలను ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే.. అవి మొలకెత్తి ప్రమాదం ఉంది.. ఈ సమయంలో అవి ఇథిలీన్ వంటి వృక్ష హార్మోన్ల రిలీజ్ చేస్తాయి. దీని వల్ల వాటి చుట్టూ ఉండే తేమ, గాలి పరిస్థితుల్లో మార్పులు వచ్చి అవి త్వరగా మొలకలెత్తడం లేదా కుళ్లిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటి ఎప్పుడూ కలిపి ఉంచవద్దు.

4 / 5
సేఫ్‌గా ఎలా నిల్వ చేయాలి: వీటిని పాడవుకుండా నిల్వ చేయాలి అంటే.. ఉల్లిపాయలు, బంగాళాదుంపలను వేర్వేరు బుట్టల్లో, చల్లని, పొడి, గాలి బాగా ఆడే ప్రాంతాల్లో మాత్రమే స్టోర్ చేయండి. అంతేకాదు ఇంట్లో నేరుగా ఎండ పడే ప్లేస్‌లో వీటిని పెట్టవద్దు. అలాగే మిగతా కూరగాయల్లా వీటిని ఫ్రిజ్‌లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు.

5 / 5
అలాగే మీరు స్టోర్ చేసిన ఉంచిన బంగాళదుంపలు మెత్తబడినా, అవి మొలకెత్తినా జాగ్రత్తగా ఉండండి.. ఉల్లిపాయల్లో ఏదైనా తేమ చేరినా, మెత్తబడినా లేదా బూజు పట్టినా వాటిని వెంటనే వేరుచేయండి. ఇలాంటి వాటిని అలానే ఉంచడం వల్ల మిగతావి కూడా పాడయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. నల్లగా మారినా లేదా బూజు వచ్చిన ఉల్లిపాయలు, మొలకలు వచ్చిన ఆడుగడ్డలను తినకపోవడమే మంచింది..

Loading...
Unable to load recommendations.
Follow Us