
శరీరానికి హైడ్రేషన్: చియా సీడ్స్ తన బరువు కంటే 10 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తాయి. ఇది వేసవిలో వచ్చే డీహైడ్రేషన్ సమస్యను అరికడుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: వేసవిలో సాధారణంగా వచ్చే మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో చియా సీడ్స్‌లోని ఫైబర్ (పీచు పదార్థం) కీలక పాత్ర పోషిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరిచి, మెరుగైన జీర్ణక్రియకు సహకరిస్తుంది.

బరువు తగ్గడానికి సహకారం: చియా సీడ్స్ తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల అనవసరమైన స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారు తమ మార్నింగ్ డ్రింక్‌లో వీటిని చేర్చుకోవడం ఉత్తమం.

ఎలా తీసుకోవాలి?: ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ చియా సీడ్స్ వేసి 30 నిమిషాలు నానబెట్టి, అందులో కొంచెం నిమ్మరసం కలిపి తాగాలి. లేదంటే, స్మూతీలు, షేక్స్‌లలో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు తాగే పండ్ల రసాలు లేదా స్మూతీలపై వీటిని చల్లుకోవచ్చు. పెరుగులో కలిపి లేదా పాలు, పండ్లతో చియా పుడింగ్ తయారు చేసుకుని అల్పాహారంగా తీసుకోవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: చియా సీడ్స్‌ను ఎప్పుడూ పొడిగా (Dry) తినకూడదు. అవి గొంతులో అడ్డుపడే ప్రమాదం ఉంది, కాబట్టి కచ్చితంగా నానబెట్టే వాడాలి. అతిగా తీసుకుంటే కడుపు ఉబ్బరం లేదా డయేరియా వచ్చే అవకాశం ఉంది. రోజుకు 1-2 టీస్పూన్లు సరిపోతాయి. గర్భిణీలు లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఈ వేసవిలో చియా సీడ్స్‌ను మీ డైట్‌లో భాగం చేసుకుని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండండి!