Tea vs black Coffee: టీ కంటే బ్లాక్ కాఫీ ఎందుకు బెస్ట్..! ఈ సూపర్‌డ్రింక్‌తో కలిగే అద్బుత ప్రయోజనాలు ఇవే!

Updated on: Jan 14, 2026 | 9:33 PM

Why black coffee is better than tea: ఈ మధ్య కాలంలో టీ, కాఫీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాక ఏదో ఒక సందర్భంలో దీన్ని జనాలు తాగుతూనే ఉంటారు. కొందరు టీ తాగేందుకు ఇష్టపడితే.. మరికొందరు కాఫీ, బ్లాక్ తాగాలని ఇష్టపడుతారు. అయితే టీతో పోలిస్తే బ్లాక్ కాఫీ అనేది ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి టీ కంటే బ్లాక్ కాఫీ ఎందుకు మంచిదో.. దాని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

1 / 5
బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: తక్షణ శక్తిని అందించడంలో బ్లాక్ కాఫీ అనేది టీ కంటే ఉత్తమంగా పనిచేస్తుంది. ఒక కప్పు బ్లాక్ కాఫీలో దాదాపు 95 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది, అదే కప్పు బ్లాక్ టీలో 26-48 మిల్లీగ్రాములు ఉంటాయి. కెఫిన్ మనకు తక్షణ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే బ్లాక్ టీ కంటే కాఫీ బెస్ట్ అనిపిస్తుంది.

2 / 5
బరువు నియంత్రణ: బరువు తగ్గాలనుకునే వారికి బ్లాక్ కాఫీ మంచి ఎంపిక ఎందుకంటే బ్లాక్ కాఫీలో తక్కువ కెలరీలు ఉంటాయి. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతాయి. అలాగే బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ ఆమ్లం వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి మంటను తగ్గిస్తాయి, మధుమేహం,హృదయ సంబంధ పరిస్థితుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. టీలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నప్పటికీ, కాఫీలోని పాలీఫెనాల్స్ చాలా వైవిధ్యమైనవి.

3 / 5
ఆలోచన శక్తి : మెరుగైన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఉన్నవారికి బ్లాక్ కాఫీ మంచి ఎంపిక. ఎందుకంటే బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడిజెనరేటివ్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. టీలో కూడా జ్ఞాపక శక్తిని పెంచే పోషకాలు ఉన్నప్పటికీ అది బ్లాక్ కాఫీతో పోలిస్తే చాలా తక్కవు

4 / 5
శారీరక పనితీరు: బ్లాక్ కాఫీ తాగేందుకు అథ్లెట్ల చాలా ఇష్టపడుతారు. ఎందుకంటే ఇది శారీరక పనితీరును పెంచుతుంది. వర్కౌట్‌కు  ముందు కాఫీ తాగడం వల్ల శరీరంలో అడ్రినలిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. దీంతో మీరు ఈజీగా వ్యాయాయం చేయవచ్చు. అలాగే శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది.

5 / 5
ఆరోగ్యకరమైన బ్లాక్ కాఫీని ఎలా తయారు చేయాలి?: ఆరోగ్యకరమైన బ్లాక్ కాఫీ తయారు చేయడానికి. అసలైన కాఫీ గింజలను ఉపయోగించాలి. ఫ్రెంచ్ ప్రెస్, పోర్-ఓవర్ లేదా డ్రిప్ పద్ధతిని ఉపయోగించి వేడి నీటితో బ్లాక్ కాఫీని తయారు చేయండి. అలాగే అందులో కొంచెం దాల్చిన చెక్కను యాడ్ చేసుకోండి. ఇది రుచిని మరింత పెంచుతుంది. అయితే బ్లాక్ కాఫీని మితంగా తాగడం ఆరోగ్యానికి మంచింది.