
మనం కొన్ని నిత్యావసర సరుకులను డజన్లలో లెక్కిస్తుంటాం వాటిలో కూడా ఒకటి. ఈ కోడి గుడ్లను సాధారణంగా డజన్లలో లెక్కిస్తుంటాం. అసలు ఈ పద్ధతిని ఎందుకు ఫాలో అవుతున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక చాలా మందికి తెలియని నిజాలు ఉన్నాయి. వాటిలో రెండు ముఖ్యమైన వాటిని ఇక్కడ తెలుసుకుందాం..

మొదటిది ఈ గుడ్లను డజన్లలో లెక్కించే పద్ధతి ముందుగా ఇంగ్లాండ్‌లో స్టార్ట్ అయింది ఆ తరవాత ఇది ఇంగ్లాండ్‌లో ఇంపీరియల్ యూనిట్ సిస్టం ఉండేది. దీనిలో 12 పెన్నీలు కలిపితే ఒక షిల్లింగ్ అయ్యేది. అలా ఒక గుడ్డును ఒక పెన్నీకి అమ్మేవాళ్ళు. ఒక షిల్లింగ్ చెల్లించి 12 గుడ్లను కొనుగోలు చేసేవాళ్లు

అలా 12 గుడ్లను కొనడం అప్పటి నుంచి ఒక అలవాటుగా మారి ఇప్పటికి ఎంతో మంది ఫాలో అవుతున్నారు. 12 అనే సంఖ్యను 2, 3, 4, 6 వంటి సంఖ్యలతో ఈజీగా భాగించవచ్చు. దీని వలన గుడ్లను కుటుంబ సభ్యుల కూడా ఎలాంటి గొడవలు లేకుండా సమానంగా పంచుకోవడం చాలా ఈజీ అవుతుంది.

ఆ కరెన్సీ ఇప్పుడు చలామణిలో లేకపోయినా, గుడ్లను ఇదే పద్దతిలో కొనుగోలు చేస్తున్నారు. కోడి గుడ్లను డజన్‌గా కొనుగోలు చేయడానికి ఈ కారణమే వలెనే 12 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. దీనిని రెండు, మూడు లేదా నాలుగు భాగాలుగా ఈజీగా విభజించవచ్చు

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ నుంచి ఇది తీసుకోబడింది పలు అధ్యయనాలు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)