ఇలాంటి ఫుడ్స్‌ తింటే త్వరగా ముసలివాళ్లయిపోతారు జాగ్రత్త..! వెంటనే దూరం పెట్టేయండి..!!

|

Dec 29, 2024 | 3:20 PM

మీ రోజువారీ ఆహారపు అలవాట్లు మిమ్మల్ని వేగంగా వృద్ధాప్యానికి చేరువ చేస్తాయని మీకు తెలుసా? కొన్ని విషయాలు మీ శరీరానికి హాని చేయడమే కాకుండా మీ చర్మంలో అకాల ముడతలు, చర్మం కుంగిపోవడానికి కూడా కారణమవుతాయి. అలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ వయస్సు కంటే కూడా పెద్దవారగా కనిపిస్తారు. అలాంటి చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మీ ఆరోగ్యం, అందం రెండింటికీ ముప్పు ఏర్పడుతుంది. మీరు ఎల్లప్పుడూ యవ్వనంగా, ఫిట్‌గా కనిపించాలనుకుంటే, వెంటనే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండండి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5
వేయించిన ఆహారాలు కూడా మీ చర్మానికి హానికరం. ఇది ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని దెబ్బతీస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఆలూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్.. ఇంకా ఆలూతో చేసే రకరకాల ఫ్రైలను వీలైనంతవరకూ దూరం పెట్టాలి. వీటిని డీప్ ఫ్రైలో వండుతారు కదా.. ఇవి మన శరీర కణాలకు హాని చేస్తాయి. అంతేకాదు.. వీటిలో అధిక ఉప్పు వేస్తారు. అది కూడా ముసలితనం త్వరగా వచ్చేలా చేస్తుంది.

2 / 5
మనం రెగ్యులర్‌గా తాగే కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌ను కూడా తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో కెఫైన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా మారి వృద్ధాప్య సంకేతాలు త్వరగా కనిపిస్తాయి. ఇది నిద్రను కూడా దూరం చేస్తుంది. సరిగా నిద్రపోకపోతే.. త్వరగా ముసలితనం వస్తుంది.

3 / 5
చక్కెర ఎక్కువగా తినేవారికి త్వరగా ముసలితనం త్వరగా వస్తుందని అనేక పరిశోధనలు తేల్చాయి. ఎక్కువ షుగర్ వాడకం వల్ల డయాబెటిస్, లివర్ సమస్యలు వస్తాయి. పంచదార.. కొల్లాజెన్‌ని నాశనం చేసి.. చర్మం ముడతలు పడేలా చేస్తుంది.కణాల జీవితకాలం కూడా తగ్గిపోతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

4 / 5
ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడి కాలేయం ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. దీని కారణంగా, శరీరం సహజ గ్లో కోల్పోవడం ప్రారంభమవుతుంది. ఆల్కహాల్ వేడి చేస్తుంది. ఇది కణాలు త్వరగా చనిపోయేలా చేస్తుంది. ఆల్కహాల్ కారణంగా.. చర్మం పాడై ముడతలు వస్తాయి. కళ్లు ఎర్రబారతాయి, ఉబ్బుతాయి. కణాలకు అవసరమయ్యే కొల్లాజెన్‌ని కోల్పోతారు. అందుకే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు.

5 / 5
త్వరగా ముసలితనం రాకూడదంటే.. సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. వీటిలోని పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. విటమిన్ సీ, ఈ వంటివి చర్మ కణాలను కాపాడి.. సమస్యల్ని దూరం చేస్తాయి. అలాగే, కూరగాయలు, తృణధాన్యాలు.. శరీరంలో వేడిని తగ్గించి.. త్వరగా ముసలితనం రాకుండా చేస్తాయి. పాలకూర, టమాటా, సాల్మన్ చేపలు, ఓట్స్, పప్పులు, గింజల వంటివి ఎక్కువగా తీసుకుంటే.. త్వరగా ముసలితనం రాదు. కూరగాయలు, మొలకలు, తృణధాన్యాలతో చేసే సూప్‌లు ఎక్కువగా తీసుకోవాలి.