
కార్తీక మాసంలో చాలామంది నెలంతా పూజలు చేసుకుంటూ, శివుడిని లేదా విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా కొలుస్తూ, పురాణాలు చదువుతూ ఉపవాసాలు ఉంటారు. కొంతమంది కార్తీక సోమవారాల్లో మాత్రమే ఉపవాసం ఉంటే, మరికొంతమంది కార్తీక మాసం మొత్తం ప్రతిరోజూ పూజలు చేస్తూ ఉపవాసాలు చేస్తారు . అయితే కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఉపవాసం విడిచి పెట్టిన తర్వాత ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?

ఉపవాసం పూర్తయిన వెంటనే ఎక్కువ మొత్తంలో మీరు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. చాలాసేపు ఆహారం తీసుకోకుండా ఉన్న తర్వాత ఒక్కసారిగా ఎక్కువ ఆహారం తీసుకుంటే జీర్ణక్రియకు ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఉపవాసం విడిచిన తర్వాత ముందుగా మంచినీళ్లు లేదా మజ్జిగ తీసుకోవాలి.

తేలికపాటి ఆహారం తీసుకోవాలి: మీరు కొంత సమయం తర్వాత తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అంటే ఎలాంటి ఫుడ్స్ అంటే ఇడ్లీ, ఆకుకూరలు వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. వీటిని మీరు తొందరగా జీర్ణమవుతాయి. లేదంటే కొద్దిగా పండ్లు తీసుకోవచ్చు

ఎక్కువ ఆహారం తీసుకోకూడదు: ఉపవాసం తర్వాత వెంటనే ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. అలాగే ఎక్కువ పులుపు ఉన్న పదార్థాలను కూడా తగ్గించాలి. లేకపోతే అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ విధంగా కార్తీక మాసంలో పూజలు, ఉపవాసాలు చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ ఆ పరమశివుడిని, శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ప్రార్ధించండి .