
కావలసిన పదార్థాలు: 3 కప్పుల ఉల్లికాడలు, అయితే వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. 5 గుడ్లు, రెండు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె.

ఉల్లికాడలు ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలంటే.. ముందుగా పోపుకు రెడీ చేసుకోవాలి : గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించి దానిలో టమోటా ముక్కలు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి.

ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లికాడలను కూడా తీసుకుని దానిలో 10 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఆ తర్వాత గుడ్లను బ్రేక్ వేసి దానిలో వేయాలి.

అయితే, వీటిని వెంటనే కలపకుండా మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివర్లో దీనిని మిక్స్ అయ్యేలా కలుపుతూ గుడ్డు మిశ్రమం కూడా ఉల్లికాడలతో కలిసిపోయే వరకు దీనిని బాగా వేయించాలి.