Photo Gallery: 17 ఏళ్లుగా భార్య శవం పక్కనే.. ఆమె ఎముకలు కుళ్లిపోకుండా వినూత్న ఆలోచన
ఇది ఒక భర్తకు భార్యపై ఉన్న అమితమైన ప్రేమకు ఉదాహారణగా చెప్పుకోవాల్సిన స్టోరీ.. చనిపోయిన భార్యను వీడలేని ఓ భర్త ఆమె శవంతోనే 17 ఏళ్లుగా నిద్రిస్తున్నాడు. మరి, అన్నేళ్లు.. శవంతో ఎలా అనేగా మీ సందేహం. ఆ పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
17 ఏళ్లుగా భార్య శవం పక్కనే నిద్ర.
Follow us on
ఈ వియాత్నం వ్యక్తి భార్య చనిపోయినా సరే.. ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమెను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేక.. ఆమె శవాన్ని తన పడక మీద పెట్టుకుని నిద్రిస్తున్నాడు.
భార్యను వీడలేక ఈ వ్యక్తి ఆమె సమాధి పక్కనే నిద్రించేవాడు. నెలల తరబడి అతడు స్మశానంలో గడిపాడు. ఓ రోజు వర్షం కురవడంతో అక్కడ ఉండటం కుదరలేదు
దీంతో సమాధి పక్కనే సొరంగం తవ్వి.. ఆమెకు దగ్గరగా పడుకున్నాడు. చాలా రోజుల తర్వాత లీ పిల్లలు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. అతడిని వారించి ఇంటికి తీసుకెళ్లారు.
అతడు భార్య లేకుండా ఉండలేకపోయాడు. దీంతో స్మశానంలోకి వెళ్లి ఆమె సమాధిని తవ్వి అస్థికలను ఇంటికి తెచ్చి.. వాటిని తన పడక గదిలో పెట్టుకుని నిద్రపోయాడు.
ఆమె అస్థికలు కుళ్లిన స్థితిలో ఉండటంతో.. ప్లాస్టర్ ఆఫ్ పారీస్, సిమెంటు, జిగురు, ఇసుకల మిశ్రమంతో లీ ఓ మహిళ బొమ్మను తయారు చేశాడు. తన భార్య అస్థికలను అందులో ఉంచి.. అందులోనే భార్యను చూసుకుంటున్నాడు.