
కొంత మంది తమకు సంపద ఉందని, ఉద్యోగం చేస్తూ గొప్పగా జీవిస్తున్నారు అని, మరికొంత మంది తామే అందంగా ఉన్నాం అని ఇలా ఏదో ఒక రకంగా అహంకారం ఉంటుంది. అయితే ఇది అహంకారం కాదు, ఇది ఒక తీవ్రమైన వ్యాధి అని అంటున్నారు నిపుణులు. దీని కారణంగా మన జీవితంలో మనం చాలా వెనకబడి పోయి, సర్వం కోల్పోతాం అని చెప్పడం లేదు, కానీ మహాభారతం విదుర నీతి ప్రకారం, ఉద్యోగ పర్వంలోని ప్రజాగర్ పర్వం 33 నుంచి 40వ అధ్యాయాలలో అహంకారం ఉంటే, వ్యక్తి జీవితంలో అన్నీ కోల్పోవడం జరుగుతుందని వర్ణించడం జరిగింది.

అతి అహంకారం వలన అందం, సంపద తగ్గుతుంది.ముఖ్యంగా గౌరవం కోల్పోతారంట. ప్రజలు మిమ్మల్ని గౌరవించడం తగ్గుతుంది. ఎప్పుడూ కూడా మీ చుట్టు ఉన్నవారు మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారు. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని చులకనగా చూడటం ప్రారంభిస్తారు. దీని వలన మీ అహంకారమే మీకు విలువ లేకుండా చేస్తుందని చెబుతున్నాడు విదురుడు.

విదుర నీతి ప్రకారం, అహంకారం వలన నిజమైన బంధాలు విచ్ఛిన్నం అవుతాయి. డబ్బు , గర్వం మీ నిజమైన బంధాలను నాశనం చేస్తుంది. అంతే కాకుండా ఇతరులు కూడా మిమ్మల్ని చులకనగా చేసేలా చూస్తుంది. ముఖ్యంగా నిజమైన బంధాలు గాజు సీసాలాంటివి , గర్వం అనే రాయి తాకితే అవి ముక్కలై పోతాయి అని చెబుతున్నారు నిపుణులు.

మనశ్శాంతి లోపిస్తుంది. అత్యంత అందంగా ఉండటం, ఇంటిలో ఎక్కువగా సంపద ఉండటం వలన ఇది మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అంతే కాకుండా అనేక సమస్యలకు కారణం అవుతుంది అని చెబుతున్నాడు విదురుడు. అలాగే కొంత మందికి దిష్టి అధికంగా తగిలి ఇబ్బందులకు గురి అవుతారు. అలాగే కొంత మంది తమ వద్ద ఉన్న ధనం ఎక్కడ దొగింలించబడుతుందో అనే భయం వెంటాడుతుందంట. దీంతో ఆనందంగా ఉండలేరంట

అలాగే ఒక వ్యక్తి తన అందం, సంపదను చూసుకొని గర్వపడటం మొదలు అయితే, కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యాన్ని కూడా కోల్పోవడం జరుగుతుందంట. అంతే కాకుండా వారే అత్యంత తెలివైన వారిగా భావించి, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలను కోల్పోవడం జరుగుతుంది అని చెబుతున్నాడు విదురుడు.