
ఉత్తరాఖండ్ పూల లోయ గురించి ఎంత చెప్పినా తక్కువే. వందల సంఖ్యలో రకరకాల పూలు ఉంటాయి. చూడటానికి రెండు కళ్లు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని భూళోక స్వర్గం అని కూడా అంటారు. ఇక్కడికి వెళితే స్వర్గంలోకి వెళ్లినట్లే ఉంటుందని చెప్పుకొస్తారు ప్రకృతి ప్రేమికులు.

ఎండలు తగ్గిపోయి, తొలకరి జల్లులు పడుతున్న సమయంలో ఒక్కసారిగా వందల కొద్ది పూలు వికసిస్తాయి. లేలేత ఆకులతో, గుబురుగా పూలు పూసి, చిరు జల్లులను ముద్దాడుతుంటాయి. ఆ సమయంలో ఈ లోయ చాలా అద్భతంగా కనిపిస్తుందంట. అందుకే జూన్ నెల నుంచి పర్యాటకులు అనుమతిని ఇస్తారు అధికారులు. అయితే జూన్ ప్రారంభమైంది. అందువలన ఈ సమయంలో చాలా మంది ఉత్తరఖాండ్ లో ఉన్న ఈ అందమైన పూలలోయను సందర్శిస్తుంటారు. ప్రకృతిలో మమేకమై, రంగు రంగుల పూల మధ్య ఆనందంగా గడుపుతుంటారు.ముఖ్యంగా ఫొటోషూట్‌లకు ఇది చాలా బెస్ట్ అని చెప్పవచ్చును.

ఈ బ్యూటిఫుల్ పూల లోయ, ఉత్తరఖాండ్‌లోని గర్హాల్ హిమాలయాలలోని చమోలి జిల్లాలో ఈ అందమైన పూల లోయ ఉంది. ఇది వర్షాకాలం రాగానే రంగు రంగుల పూలతో దుప్పటి కప్పినట్లుగా లోయ మొత్తం అందంగా ఫ్లవర్స్‌తో అలంకరించబతుంది. సుమారు 87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ లోయ 3600మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది.

దాదాపు ఈ లోయలో 500 కంటే ఎక్కువ జాతుల పూలు వికసిస్తాయి. గులాబీ, ఊదా , నీలం , తెలుపు, పసుపు రంగు పూలతో ఈ లోయ మొత్తం నిండిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ సమయంలో హిమాలయన్ బ్లూ పాపీ, బ్రహ్మ కమలం, ఇలా అనేక రకాల పూలు ఈ సమయంలో వికసించి, లోయ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది.ఈ లోయలో జూన్‌లో మొత్తం పచ్చగా మారిపోతుంది. జూలైలో పూలు వికసిస్తాయి. ఆగస్టు నెలలో లోయ మొత్తం పూలతో అందంగా నిండిపోతుంది.

అయితే ప్రకృతి ప్రేమికులు ఎవరు అయితే ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ సందర్శించాలి అనుకుంటున్నారో, వారికి ఆగస్టు నెల చాలా బెస్ట్ అని చెప్పవచ్చును. ఈ సమయంలో లోయ మొత్తం పూలతో నిండిపోతుంది. రంగు రంగుల పూలతో లోయ ఇంద్రధనస్సులా కనిపిస్తుందంట.ఈ లోయ దాని పువ్వులకే కాకుండా అరుదైన వన్యప్రాణులకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎర్ర నక్కలు, నీలి గొర్రెలు, హిమాలయ కస్తూరి జింకలు, అప్పుడప్పుడు అరుదైన మంచు చిరుత కూడా కనిపిస్తాయి. అయితే, ఈ జంతువులు అంత సులభంగా కనిపించవు అంటున్నారు నిపుణులు.