
వయనాడు, కేరళ: కేరళ అనగానే గుర్తొచ్చే ప్రకృతి, పచ్చని చెట్లు. కంఫర్టబుల్ కపుల్స్ ట్రిప్‌కి దీనికంటే మంచి ప్లేస్ ఏముంటుంది? చెప్పండి. గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళలోని గ్రామీణ జిల్లా వయనాడు దట్టమైన అడవులు, ఎత్తైన ప్రాంతాలు, విభిన్న వన్యప్రాణులతో ప్రసిద్ధి చెందింది. నియోలిథిక్ యుగానికి చెందిన పురాతన పెట్రోగ్లిఫ్స్ ఉన్న గుహలు ఇక్కడ ఉన్నాయి. ఆంత్రోపాలజీ ఆసక్తి ఉన్నవారికి ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇక్కడి వచ్చే కపుల్స్ నేచర్ రిసార్ట్స్‌లో బస చేస్తే వీకెండ్ రొమాన్స్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు.

కూర్గ్, కర్ణాటక: వాలైంటైన్ వీకెండ్ ట్రిప్‌కు మరో బెస్ట్ ప్లేస్ కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతం. ఇక్కడ హిల్స్ మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. వెస్టర్న్ ఘాట్స్‌లో ఉన్న ఈ సీనిక్ జిల్లాలో అద్భుతమైన పర్వత శిఖరాలు, ఆకుపచ్చ ల్యాండ్‌స్కేప్స్, కాస్కేడింగ్ వాటర్‌ఫాల్స్ మిమ్మల్ని మైమర్చిపోయేలా చేస్తాయి. ఇక్కడ కాఫీ, మసాలా ప్లాంటేషన్స్ కూడా ఉన్నాయి. స్థానిక వంటకాలు మీ హోమ్‌స్టే లేదా లగ్జరీ రిసార్ట్ అనుభవాన్ని మరింత మధురంగా చేస్తాయి. మీరు ఒక్కసారి ఈ ప్లేస్‌ను విజిట్ చేస్తే.. లైఫ్‌లో బెస్ట్ ఎక్సీరియన్స్‌ను తెచ్చుకుంటారు.

హవెలాక్ ఐలాండ్, అండమాన్ అండ్ నికోబార్: వాలైంటైన్ వీకెండ్‌లో వెళ్లాల్సిన మరో ప్లేస్ హవేలాక్ ఐలాండ్. అడ్వెంచర్‌తో కూడిన రొమాంటిక్ వీకెండ్ కావాలంటే హవెలాక్ ఐలాండ్ బెస్ట్ విజిట్ అవుతుంది. తెల్లటి ఇసుక బీచ్‌లు, రంగురంగుల కోరల్ రీఫ్స్ ఇక్కడ ఎంతో ప్రసిద్ధి. స్కూబా డైవింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్ వంటి యాక్టివిటీస్‌తో ఆడ్రినలిన్ పంప్ చేసుకోవచ్చు. పోర్ట్ బ్లెయిర్ నుంచి కేవలం 70 కి.మీ. దూరంలో ఉండటంతో ట్రావెల్ చేయడం కూడా చాలా సులభం

తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్: మంచుతో మునిగితేలే ‘వైట్ వాలెంటైన్’ కావాలనుకుంటున్నారా? అయితే మీరు హిమాలయాల మధ్యలో ఉన్న తవాంగ్‌కి వెళ్లాల్సిందే. హిల్ స్టేషన్ ట్రావెలాగ్‌ల నుంచి బయటకు వచ్చినట్లుండే ఈ పట్టణంలో మంచు కప్పిన శిఖరాలు, నిశ్శబ్ద లోయలు చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. మీ ప్రియమైన వ్యక్తితో అద్భుతమైన ప్రకృతి, వాతావరణాన్ని ఆస్వాధించేందుకు పర్ఫెక్ట్ ప్లేస్. స్థానిక సంస్కృతి తెలుసుకోవాలంటే భవ్యమైన మఠాలు (మఠాలు) తప్పక చూడాలి.

కౌసానీ, ఉత్తరాఖండ్: మీ వాలైంటైన్స్ వీకెండ్ ట్రిప్‌లో మీరు ప్రశాంతను కోరుకుంటే.. హిమాలయాల్లో సుమారు 1900 మీటర్ల ఎత్తులో ఉన్న చిన్న హిల్ స్టేషన్ కౌసానీ మీకు అద్భుత ఎంపిక అవుతుంది. త్రిశూల్, నందాదేవి, పంచచూలి వంటి శిఖరాల పానరమిక్ వ్యూస్ ఇక్చ్చే ఈ చోట దట్టమైన పైన్ చెట్లు, తోటలు, ఆశ్రమాల నిశ్శబ్దం, హిమాలయాల గాంభీర్యం మీమధ్య అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టిస్తాయి.