
కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు పెసరపప్పు, రెండు కప్పుల బియ్యం, , పాలు 3 కప్పులు, పావు కిలో బెల్లం ఏలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, 10 జీడిపప్పు, ఒక కప్పు బాదం, 3 టేబుల్ స్పూన్స్ కిస్‌మిస్, కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి.

ముందుగా, పెసరపప్పు, బియ్యాన్ని కడిగి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇక ఇప్పుడు ఇంకో దానిలో బెల్లాన్ని తీసుకుని సన్నగా తురిమి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే, కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.

స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి దానిలో మూడు కప్పులు పాలు పోసి అవి మరిగిన తర్వాత, దానిలో తురిమిన బెల్లం, యాలకుల పొడి వేసి అది కరిగిపోయే వరకు స్టవ్ మీదే ఉంచి తిప్పుతూ ఉండాలి.

పాలు చిక్కబడిన తర్వాత, ముందుగా పక్క పెట్టుకున్న బియ్యం, ఉడికించిన పెసర పప్పును వేసి, మీడియం మంట మీద గరిటే కలుపుతూ 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. పప్పు ఉడికే వరకు గ్యాస్ పొయ్యి మీదే ఉంచండి.

ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి లేదా నూనె వేసి అది వేడయ్యాక 10 జీడిపప్పు, 5 బాదం, 3 టేబుల్ స్పూన్స్ కిస్‌మిస్‌లను వేయించి, పాయసంలో వేసి కలుపుకోవాలి. అంతే, వేడి వేడి పెసరపప్పు పాయసం రెడీ.