ఇంట్లో తులసి మొక్క ఉందా? అయితే, ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. అదే మిమ్మల్ని పేదవారిని చేస్తుంది!

Updated on: Jul 07, 2026 | 7:04 AM

భారతీయ సంస్కృతిలో ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క కనిపిస్తుంది. తులసిని కేవలం ఒక మొక్కగా కాకుండా మహాలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు. ఇంట్లో తులసి ఉండటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే, తులసి మొక్కను ఇంట్లో ఉంచినప్పుడు వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఏ చిన్న తప్పు చేసినా అది ఇంట్లోని శాంతి, ఐశ్వర్యాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఆ ఐదు నియమాలు ఇవే:

1 / 5
శివలింగం పూజలో తులసిని ఉపయోగించకూడదు: పురాణాల ప్రకారం జలంధరుడు అనే రాక్షసుడి భార్య వృంద (తులసి). శివుడు జలంధరుడిని వధించినందున, శివపూజలో తులసి దళాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు. వినాయకుడికి కూడా తులసిని సమర్పించడం నిషిద్ధం. కేవలం శ్రీమహావిష్ణువు పూజలోనే తులసికి అగ్రతాంబూలం ఉంటుంది.

2 / 5
ఆకులు కోసే నియమాలు: తులసి ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు. ఏకాదశి, ద్వాదశి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఆదివారాల్లో తులసి ఆకులను అస్సలు తుంచకూడదు. అలాగే సూర్యాస్తమయం తర్వాత తులసిని తాకడం కానీ, ఆకులు కోయడం కానీ చేయకూడదు.

3 / 5
ఎండిపోయిన మొక్కను ఉంచకూడదు: ఒకవేళ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతే, దానిని వెంటనే తీసివేసి నదిలో లేదా పవిత్రమైన నీటిలో నిమజ్జనం చేయాలి. ఎండిన తులసి మొక్క ఇంట్లో ఉంటే వాస్తు దోషం ఏర్పడి, కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. వెంటనే ఆ స్థానంలో కొత్త మొక్కను నాటాలి.

4 / 5
సరైన దిశ : వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎల్లప్పుడూ ఇల్లు లేదా ప్రాంగణంలో ఉత్తర, తూర్పు లేదా ఈశాన్య దిశలలో మాత్రమే నాటాలి. ఈ దిశలు కుబేరుడు, దేవుళ్లకు స్థానాలు కాబట్టి ఐశ్వర్యం లభిస్తుంది. పొరపాటున కూడా దక్షిణ దిశలో తులసిని పెట్టకూడదు.

5 / 5
శుభ్రత, పరిసరాలు: తులసి కోట చుట్టుపక్కల పరిసరాలను ఎల్లప్పుడూ చాలా శుభ్రంగా ఉంచాలి. తులసి మొక్క దగ్గర మురికి బట్టలు, చెప్పులు లేదా చెత్తబుట్టలను ఉంచకూడదు. అలాగే ముళ్ల మొక్కలను తులసి పక్కన అస్సలు ఉంచకూడదు. ప్రతిరోజూ సాయంత్రం తులసి కోట వద్ద నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి నశిస్తుంది. ఈ నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఐశ్వర్యం మెరుగవుతాయి.

Follow Us