అప్పట్లో చుట్టాలు ఇంటికొస్తే పచ్చి కారంతో ఇలా చేసి పెట్టేవాళ్లు.. పల్లెటూరి మట్టివాసనతో కమ్మగా

Updated on: Jul 05, 2026 | 10:33 AM

మీరు ఈ పచ్చి కారంను వేడి వేడి అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. నువ్వుల నూనెతో ఇంకా టేస్ట్ వస్తుంది. తినేటప్పుడు పల్లెటూరి మట్టివాసనతో అద్భుతంగా ఉంటుంది. అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చి కారం రెసిపీకి కావలసిన పదార్థాలు: 6 లేత వంకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 8 ఎండుమిర్చి , 
5 పచ్చిమిర్చి , చిన్న నిమ్మకాయంత చింతపండు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, 
3 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనెను తీసుకోవాలి.

పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చి కారం రెసిపీకి కావలసిన పదార్థాలు: 6 లేత వంకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 8 ఎండుమిర్చి , 5 పచ్చిమిర్చి , చిన్న నిమ్మకాయంత చింతపండు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనెను తీసుకోవాలి.

2 / 5
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చి కారం తాలింపు కోసం తీసుకోవాల్సినవి: ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ 
మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్  సెనగపప్పు , నాలుగు ఎండుమిర్చి, 10 కరివేపాకు రెమ్మలు,  కొద్దిగా ఇంగువను తీసుకోవాలి. దీనిని సరైన విధంగా చేస్తే రుచి అదిరిపోతోంది.

పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చి కారం తాలింపు కోసం తీసుకోవాల్సినవి: ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ సెనగపప్పు , నాలుగు ఎండుమిర్చి, 10 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా ఇంగువను తీసుకోవాలి. దీనిని సరైన విధంగా చేస్తే రుచి అదిరిపోతోంది.

3 / 5
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చి కారం రెసిపీ తయారీ విధానం: ముందుగా వంకాయలను కడిగి పెనం పైన్ మంచిగా కాల్చుకోవాలి. 
ఆ తర్వాత చల్లారిన తర్వాత  తొక్క తీసి  గుజ్జును తీసి ఒక ప్లేట్ లేదా గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తరవాత చింతపండును 5 నిమిషాలు నానబెట్టి గుజ్జును తీసుకోవాలి. ఇలా చేస్తే ముక్క మగ్గుతుంది.

పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చి కారం రెసిపీ తయారీ విధానం: ముందుగా వంకాయలను కడిగి పెనం పైన్ మంచిగా కాల్చుకోవాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత తొక్క తీసి గుజ్జును తీసి ఒక ప్లేట్ లేదా గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తరవాత చింతపండును 5 నిమిషాలు నానబెట్టి గుజ్జును తీసుకోవాలి. ఇలా చేస్తే ముక్క మగ్గుతుంది.

4 / 5
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చి కారం రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : నాలుగు ఎండుమిర్చి,  ఒక టేబుల్ స్పూన్ ను జీలకర్రను కొద్దిగా  వేయించి చల్లారనివ్వాలి. ఆ తరవాత మిక్సీ  తీసుకుని దానిలో వేయించిన నాలుగు ఎండుమిర్చి, నాలుగు వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా దంచుకోవాలి

5 / 5

పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చి కారం రెసిపీ తయారీ విధానం స్టెప్ 2 : ఇప్పుడు కాల్చిన వంకాయ గుజ్జు, ఇంకా కొద్దిగా చింతపండు గుజ్జు  కూడా వేసి కొంచం గరుకుగా రుబ్బుకోవాలి.  ఒక చిన్న పాన్ లో కొద్దిగా నువ్వుల నూనె వేసి బాగా వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, నాలుగు ఎండుమిర్చి, నాలుగు కరివేపాకు, ఇంకా ఇంగువతో  పోపు పెట్టుకోవాలి.

Follow Us