
మెంతి కూర వడలకు కావలసిన పదార్థాలు: ఒక కట్ట మెంతికూర, ఒక కప్పు శనగపిండి , పావు కప్పు బియ్యప్పిండి , ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి , ఒక చిన్న అల్లం ముక్క, 10 కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు , ఇంకా నూనెను వేయించడానికి సరిపడా తీసుకోవాలి.

మెంతి కూర వడల తయారీ విధానం: ముందుగా మెంతికూరను బాగా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. దానిలో కట్ చేసిన ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా అల్లం పేస్ట్ , కరివేపాకు ఆకులు కూడా వేసి కలపాలి. ఇంకా శనగపిండి, కొద్దిగా బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.

మెంతి కూర వడల తయారీ విధానం స్టెప్ 1 : ఇంకా దీనిలో అవసరమైతే మీరు నీరు చల్లి ఈ పిండి వడల మిశ్రమంలో కలుపుకోవాలి. అలాగే స్టౌ మీద పాన్ పెట్టి దానిని వేడి చేయాలి. ఇంకా ఈ మిశ్రమాన్ని తీసుకుని చిన్న వడల్లా చేసి నూనెలో వేయాలి. అయితే హై మంట మీద కాకుండా ఒక వైపు బాగా కాల్చాలి.

ఒక వైపు కాలిన తరవాత రెండు వైపు కూడా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించాలి ఈ వడలను తీసి టిష్యూపై ఉంచితే ఆయిల్ ఉండదు. వీటిని పల్లీల చట్నీతో కానీ, కొబ్బరి పచ్చడితో తిన్నా కూడా రుచిగా ఉంటుంది. అయితే, వేడి వేడిగా తింటే ఈ మెంతికూర వడల రుచి మరింత టేస్టీగా ఉంటుంది.

విపరీత వేడి వల్ల యూరిన్ రాక కొందరు ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ ఆకుల వడలు తింటే అలసట పోయి ఇమ్యూనిటీ పవర్ డబుల్ అవుతుంది. ఇంఅలాగే, కా దీనిలో కొంచెం వాము కలిపితే ఈ వడలు చాలా కారంగా ఉంటుంది. అలాగే, జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. దంచి కొట్టే వానల్లో కూడా ఈ వేడి వేడి మెంతికూర వడలు తింటే ఉంటే చాలు.(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)