
ఎవరికి అయితే బొటన వేలు పైకి పెద్దగా ఉంటుందో వారు చాలా ధైర్యవంతులు, గంభీరంగా ఉంటారు. వీరు ఇతరులతో కలిసి పోవడానికి చాలా సమయం తీసుకుంటారు. అంతే కాకుండా ఎక్కువగా ఒటరిగా గడపడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ప్రయాణాలు చేయడం ఎక్కువ ఇష్టం. తమ కెరీర్ పై ఎక్కువ ఫోకస్ పెడతారు, చాలా చిన్న వయసులోనే విజయం సాధిస్తారు.

ఎవరికి అయితే బొటన వేలు వెనక్కీ వంగి ఉంటుందో వారు చాలా సున్నితమైన మనసు కలిగినవారు. ఎవరితో త్వరగా కలవరు, కానీ ఒకసారి కలిస్తే మాత్రం వారి స్నేహం వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. మంచి మనసు ఉంటుంది. ఎక్కువగా దాన ధర్మాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కుటుంబంపై అతి ప్రేమ ఉంటుంది. అలాగే వీరు కెరీర్ పరంగా చాలా స్లోగా సెటిల్ అయినా, ఉన్నత స్థాయిలో ఉంటారు.

అలాగే ఎవరికి అయితే బొటన వేలు కింద, పైన సమానంగా ఉంటుందో, వారు మంచి వ్యక్తిత్వం కలవారు, కష్టపడి పని చేస్తారు. ఏ పని చేసినా అందులో నిజాయితీగా ఉంటారు. స్నేహితులు వీరికి చాలా ఎక్కువ, వీరు అందరితో చాలా సులభంగా కష్టపడతారు, ముఖ్యంగా ఇలాంటి వారి న్యాయంగా ఉంటారు. ఇతరులు తప్పు చేస్తే వారిని అస్సలే క్షమించరు. చాలా ధైర్యం కల వ్యక్తులు

ఎవరికి అయితే బొటన వేలు చాలా పొడవుగా ఉంటుందో వీరు చాలా అదృష్టవంతులు, వీరు చాలా ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు. ఆర్థికంగా కూడా చాలా ధృఢంగా ఉంటారు. అందరితో సులభంగా కలిసి పోతారు. కళల పట్ల అమితమైన ఆసక్తి ఉంటుంది. కళా రంగంలో రాణిస్తారు. అలాగే వీరు కలివిడి స్వభావం కలవారు. ఇతరులు ఏమైనా అన్నా, మళ్లీ వారితో స్నేహ పూర్వకంగానే మెదులుతారు. ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.

బొటనవేలు పైభాగం కంటే కింది భాగం పెద్దగా ఉంటే కాస్త మొండి వైఖరిక కలిగి ఉంటారు. వీరు తమదే నెగ్గాలి అనే స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అలాగే వీరికి ఎప్పుడు కోపం వస్తుందో కూడా తెలియదు. ఒక్క సారి ఫైర్ అవుతుంటారు. ప్రేమను చూపిస్తే మాత్రం, వీరికి మిచిన వారు ఉండరు, చాలా నమ్మకమైన వ్యక్తులు. ఒక్క సారి మాట ఇస్తే దానిని ఎంత కష్టమైనా సరే నిలబెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు.