
వృషభ రాశి : ఈ రాశి వారికి ఈ నెలలో అదృష్టం కలిసి వస్తుంది. అంతే కాకుండా ఎవరు అయితే చాలా రోజుల నుంచి సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలి అనుకుంటున్నారో, వారికి ఇది మంచి సమయం, వీరు తమ సొంతింటి కలను త్వరలో నెరవేర్చుకుంటారు. ఆనందంగా జీవిస్తారు.

సింహ రాశి : సింహ రాశి వారికి ఆగస్టు నెల అద్భుతమైన ప్రయోజనాలు తీసుకొస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

తుల రాశి : తుల రాశి వారికి ఆగస్టు నెలలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగస్థులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా చాలా త్వరగా పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

మకర రాశి : మకర రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగస్థులకు ఇది చాలా మంచి సమయం.ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. వీరికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా సమయానుగుణంగా పూర్తి అవుతాయి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు