తిన్న తర్వాత అస్సలే చేయకూడని పనులివే.. చేస్తే బాడీ షెడ్డుకే!

Updated on: Aug 07, 2025 | 2:07 PM

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ చాలా మంది ఆరోగ్యం విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తుంటారు.తమకు తెలియకుండానే శరీరానికి హాని చేసే ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలా చేయడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కానీ మనం ఆహారం తీసుకున్న తర్వాత కొన్ని రకాల ఫుడ్ తీసుకోవడం వలన అది శరీరం పై తీవ్రమైన నెగిటివ్ ప్రభావం చూపుతుందంట. అది ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఆరోగ్యం బాగుండాలి అంటే తప్పకుండా ఆహారం తీసుకున్న తర్వాత అస్సలే కొన్నిరకాల ఫుడ్ తీసుకోకూడదంట. అందులో మొదటిది, టీ. చాలా మంది భోజనం చేసిన వెంటనే టీ తాగుతుంటారు. కానీ ఇది మంచి అలవాటు కాదని చెబుతున్నారు వైద్యులు. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వలన ఇది శరీరం ఐరన్ గ్రహించకుండా నిరోధిస్తుందంట. దీని వలన పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు నిపుణులు.

2 / 5
ఇంకొంత మంది భోజనం చేసిన వెంటనే తల స్నానం చేస్తుంటారు. కానీ ఇది కూడా మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.  భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వలన ఇది జీర్ణక్రియపై చాలా నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుందంట. దీని వలన కడుపు ఉబ్బరం వంటి జీర్ణసమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు.

3 / 5
వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచింది. అందుకే వైద్యులు కూడా కనీసం ప్రతి రోజూ కనీసం ముఫ్పై నిమిషాలైనా వ్యాయమం చేయాలని సూచిస్తుంటారు. అయితే ఉదయం లేచిన తర్వాత వ్యాయామం చేయడం శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కానీ కొంత మంది తిన్న వెంటనే వ్యాయామం చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు. దీని వలన వికారం, మగత వంటి సమస్యలు తలెత్తుతాయంట.

4 / 5
అలాగే భోజనం చేసిన వెంటనే కొందరు కునుకు తీస్తుంటారు. కానీ భోజనం చేసిన వెంటనే పడుకోవడం మంచిది కాదంట. దీని వలన కడుపులోని యాసిడ్ అన్నవాహికలోకి వెళ్లి గుండెల్లో నొప్పి, మంట వంటి సమస్యలకు దారి తీస్తుందంట. అందుకే తిన్న తర్వాత వెంటనే అస్సలే పడుకోకూడదంట.

5 / 5
మధ్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. దీని వలన అనేక సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే కొంత మంది టీ తాగుతూ స్మోకింగ్ చేయడం, మరికొంత మంది తిన్న తర్వాత స్మోకింగ్ చేయడం చేస్తుంటారు. కానీ ఇది శరీరంపై చాలా నెగిటివ్ ప్రభావం చూపిస్తుందంట. అందుకే తిన్న వెంటనే స్మోకింగ్ చేయడం మంచిది కాదు, ఇది జీవక్రియపై ప్రతి కూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.